బిజినెస్

అంతర్జాతీయ స్థాయిలో ఫార్మాసిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 26: అంతర్జాతీయ స్థాయిలో ఫార్మాసిటీని నిర్మిస్తున్నట్టు అందుకు ముసాయిదా బృహత్తర ప్రణాళికను రూపకల్పన చేశామని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె తారకరామారావు చెప్పారు. ఇందుకోసం టిఎస్‌ఐఐసి ద్వారా 5,646 ఎకరాల 32 గుంటల విస్తీర్ణంలో భూమిని సేకరించామని అన్నారు. దాదాపు 75,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుకు వ్యయం అవుతుందని, దీనివల్ల ప్రత్యక్షంగా లక్ష మందికి, పరోక్షంగా మరో రెండు లక్షల మందికి ఉపాధి దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. కెపి వివేకానంద, మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఎస్ రాజేందర్‌రెడ్డి, చల్లా వంశీచంద్‌రెడ్డి, తమ్మన్నగారి రాంమోహన్‌రెడ్డి, డాక్టర్ జి చిన్నారెడ్డి, ఎస్ ఎ సంపత్‌కుమార్ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సోమవారం శాసనసభలో బదులిచ్చారు. ఈ ప్రాజెక్టును ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందన్నారు. రాష్ట్రం పారిశ్రామికంగా పురోభివృద్ధి సాధించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతో దోహదం చేస్తుందని చెప్పారు. స్థల సేకరణ జరుగుతోందని, ప్రస్తుతం 8,580 ఎకరాలకు డిమాండ్ ఉందని, బల్క్‌డ్రగ్స్ సంస్థలు 4,500 ఎకరాలు, ఫార్మా కంపెనీలు 2వేల ఎకరాలు కోరాయని, 2018 నాటికి తొలి దశ కార్యకలాపాలు మొదలవుతాయని చెప్పారు. భూ సేకరణకు హడ్కో నుండి టిఎస్‌ఐఐసి 740 కోట్ల రూపాయల రుణం తీసుకుంటోందని, అందులో ఇప్పటికే 350 కోట్ల రూపాయలు విడుదలయ్యాయని, అలాగే ఆసియా ఇన్‌ఫ్రా కార్పొరేషన్ నుండి మరో 3 వేల కోట్ల రూపాయల రుణం తీసుకుంటున్నామని వివరించారు. భూ సేకరణ, పరిహారం చెల్లింపు అంశాలన్నీ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే జరుగుతాయని, పర్యావరణ ముప్పునకు సంబంధించి అంచనాలు వేసిన తర్వాత ఆయా గ్రామాల్లో సభలు నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామని పేర్కొన్నారు. రైతులకు సరైన పరిహారం అందలేదని భావిస్తే మరోమారు ఈ అంశాన్ని పున:సమీక్ష చేసేందుకు తమకు అభ్యంతరం లేదని మంత్రి పేర్కొన్నారు. అలాగే పర్యావరణ ముప్పు లేకుండా చూస్తున్నామని, ఎవరికీ ఎలాంటి అపోహలు అక్కర్లేదని చెప్పారు.