బిజినెస్

ఎఫ్‌ఎమ్‌సిజి రంగంలో ‘పతంజలి’ దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: యోగా గురువు రామ్‌దేవ్ బాబా నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద్.. దేశీయ ఎఫ్‌ఎమ్‌సిజి రంగంలో దూసుకెళ్తోంది. ఇన్నాళ్లూ ఈ రంగాన్ని శాసించిన ఐటిసి, డాబర్, హిందుస్థాన్ యునిలివర్, కాల్గేట్ పామోలివ్, పిఅండ్‌జి వంటి దిగ్గజ సంస్థలే పతంజలి ముందు చిన్నబోతున్నాయని ఓ నివేదిక చెబుతోంది. 2016 ఆర్థిక సంవత్సరంలో 769 మిలియన్ డాలర్ల టర్నోవర్‌తో 146 శాతం వార్షిక వృద్ధిరేటును పతంజలి గ్రూప్ సాధించిందని అసోచామ్-టెక్‌సై రిసెర్చ్ నివేదిక తెలిపింది. కాగా, మొదట్లో కేవలం ఆయుర్వేద ఔషధాల ఉత్పత్తికే పరిమితమైన పతంజలి గ్రూప్.. ప్రస్తుతం ఎఫ్‌ఎమ్‌సిజిలోని 500 రకాల ఆహార, ఆహారేతర ఉత్పత్తులను తయారుచేసి విక్రయిస్తోంది.