బిజినెస్

ఆర్థిక గణాంకాలపై ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: దేశ, విదేశీ పరిణామాలు, ఆర్థిక గణాంకాలు ఈ వారం భారతీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. జాతీయంగా నిక్కీ తయారీ పిఎమ్‌ఐ, సేవల పిఎమ్‌ఐ గణాంకాలు, అంతర్జా తీయంగా అమెరికా ఉద్యోగ గణాంకాలు, ఎఫ్‌ఒఎ మ్‌సి సమావేశం కీలకమని పేర్కొన్నారు. డిసెంబర్ నెల ఆటోరంగ అమ్మకాలూ ముఖ్యమేనన్నారు. కాగా, పెట్టుబడుల ఉపసంహరణలకు ప్రాధాన్యమి స్తున్న విదేశీ మదుపరుల ఆలోచనా సరళి కూడా దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తుందని, వారి పెట్టుబడులే మార్కెట్లను నిలబెట్టడమా? పడగొట్టడమా? అన్నదాన్ని నిర్ధారించే వీలు లేకపోలేదని అంటున్నారు. ఇక పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చోటుచేసుకుంటున్న పరిణా మాలూ మార్కెట్ ట్రేడింగ్‌ను శాసించనున్నాయని మార్కెట్ విశే్లషకులు అంటున్నారు. కొత్త నోట్లకు డిమాండ్, 100 రూపాయల నోట్ల కొరత ఇంకా కనిపిస్తోందని, దీంతో వ్యాపారాలు స్తంభించి పోవడం మదుపరులను కలవరపెడుతోందని మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయ. దీంతో ద్రవ్యవ్యవస్థలోకి పెరిగే కొత్త నోట్లతోనే మార్కెట్లు లేవడమా? పడిపోవడమా? అనేది తెలుస్తుందన్న అంచనాలనూ పలువురు నిపుణులు వ్యక్తం చేశారు. అయతే డిసెంబర్ 30తో రద్దయన నోట్ల డిపాజిట్‌కున్న గడువు ముగియడం, మార్చి వరకు నగదు లభ్యత తిప్పలు తప్పవన్న అంచనాలుండటం స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపేలా కనిపిస్తోంది. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18) కోసం ప్రవేశపెట్టే సాధారణ బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం.. పన్నులకు ఇచ్చే మినహాయంపులు, ఇతరత్రా ప్రయోజనాలపై నా మదుపరుల దృష్టి ఉండనుంది. మరోవైపు ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయ మారకం విలువ, గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల కదలికలు భారతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయను న్నాయ. గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 585.76 పాయింట్లు లాభపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ కూడా గత వారం ట్రేడింగ్‌లో 200.05 పాయింట్లు పెరిగింది.