బిజినెస్

గన్నవరం విమానాశ్రయంలో రూ. 128 కోట్లతో కొత్త టెర్మినల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 2: రాష్ట్ర విభజన తర్వాత అంతర్జాతీయ విమానాశ్రయంగా రూపుదిద్దుకోబోతున్న గన్నవరం విమానాశ్రయానికి ముందెన్నడూ ఊహించని రీతిలో మహర్దశ పట్టబోతోంది. ఇటీవలి కాలంలో తరచూ గన్నవరం విమానాశ్రయానికి వచ్చి వెళుతున్న కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడుకు ఈ విమానాశ్రయంపై మొదటి నుంచి తీవ్ర అసంతృప్తి ఉంది. ఇది నెల్లూరులోని కూనాలమ్మ బస్టేషన్‌లా ఉందంటూ ఆయన ఎన్నోమార్లు బాహాటంగానే విమర్శిస్తూ వచ్చారు. ఇలాంటి స్థితిలో ఈ విమానాశ్రయం రూపురేఖలే మారబోతున్నాయి. తొలిదశలో 128 కోట్ల రూపాయల వ్యయంతో రూపుదిద్దుకున్న నూతన టెర్మినల్‌కు ఈ నెల 12న విమానయాన శాఖ మంత్రి పి అశోక్‌గజపతిరాజు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. 18 చెకింగ్ కౌంటర్లు, రెండు ప్రవేశద్వారాలు, వెలుపలకు వెళ్లే ఒక ద్వారంతో 13 వేల చదరపు అడుగుల్లో పూర్తి ఎయిర్ కండిషనర్‌తో ఈ టెర్మినల్ నిర్మాణం జరిగింది. అంతేగాకుండా 3 వేల 613 చదరపు అడుగుల ఏవియేషన్ లాంజ్ ఏరియాతో 500 హాండ్లింగ్ సామర్థ్యంతో ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో చెకింగ్ ఏరియా, సెక్యూరిటీ ఎరైవల్, మీటింగ్ హాలు, బ్యాగేజ్ ఏరియా, మొదటి ఫ్లోర్‌లో ఎయిర్‌లైన్, ఎయిర్‌పోర్టు ఆఫీసు, ఏవియేషన్ లాంజ్‌తో అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ టెర్మినల్‌ను నిర్మించారు.
ఇక గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దేందుకు మరో 700 కోట్ల రూపాయలతో రన్‌వే విస్తరణ, దానికోసం భూసేకరణ, మరో అంతర్జాతీయ టెర్మినల్ భవనం నిర్మాణాలకు ప్రత్యేక కృషి జరుగుతోందని సోమవారం టెర్మినల్ పనులను పరిశీలించిన ఎంపి కేశినేని శ్రీనివాస్ ‘ఆంధ్రభూమి’ ప్రతినిధికి తెలిపారు. నిరుడు ఒకేసారి 76 శాతం ప్రయాణికుల వృద్ధిరేటు సాధించిన ఏకైక విమానాశ్రయంగా దేశంలో గుర్తింపు పొందింది గన్నవరం విమానాశ్రయం. ఇక ఎయిర్‌పోర్టు జనరల్ మేనేజర్ ప్రభాకరరావు ఆధ్వర్యంలో 12న జరిగే ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

చిత్రం..గన్నవరం విమానాశ్రయంలో ప్రారంభానికి సిద్ధమైన కొత్త టెర్మినల్