బిజినెస్

కీలక రంగాలకు పాత పెద్ద నోట్ల రద్దు దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం తీసుకున్న పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కీలక రంగాల వృద్ధిరేటును దెబ్బతీసింది. పారిశ్రామిక రంగ ఉత్పాదక రేటు నవంబర్‌లో క్షీణించింది. 4.9 శాతం వృద్ధిరేటుకే పరిమితమైంది. అంతకుముందు నెల అక్టోబర్‌లో ఇది 6.6 శాతంగా ఉంది. గతంతో పోల్చితే ఈసారి బొగ్గు, ఉక్కు, విద్యుత్ రంగాల ఉత్పాదక రేటు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ ముడి చమురు, సహజ వాయువుల ఉత్పత్తి భారీగా పడిపోయంది. రిఫైనరీ, ఎరువులు, సిమెంట్ ఉత్పత్తి స్వల్పంగా పెరిగింది. ఈ మేరకు సోమవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, బొగ్గు, ఉక్కు, విద్యుత్, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, సిమెంట్ రంగాలతో కూడిన వౌలిక రంగం వృద్ధిరేటు 2015 నవంబర్‌లో 0.6 శాతానికే పరిమితమైంది. దీంతో పోల్చితే 2016 నవంబర్‌లో కీలక రంగాల ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయలోనే ఉన్నప్పటికీ, 2016 అక్టోబర్‌తో పోల్చితే మాత్రం తక్కువే. ఇక ఈ ఎనిమిది రంగాల వాటా మొత్తం దేశ పారిశ్రామికోత్పత్తిలో 38 శాతంగా ఉంది. కాగా, నిరుడు ఏప్రిల్-నవంబర్‌లో కీలక రంగాల వృద్ధిరేటు 4.9 శాతంగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఏప్రిల్-నవంబర్‌లో ఇది 2.5 శాతంగానే ఉంది. ఇకపోతే నవంబర్‌లో బొగ్గు ఉత్పాదక రేటు 6.4 శాతం, ఉక్కు ఉత్పత్తి 5.6 శాతం, విద్యుదుత్పత్తి 10.2 శాతం పెరిగినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. రిఫైనరీ, సిమెంట్ రంగాల్లో వృద్ధిరేటు వరుసగా 2, 0.5 శాతంగా నమోదయ్యాయి. 2015 నవంబర్‌లో ఇవి 1.7 శాతం, మైనస్ 1.7 శాతంగా ఉండటం గమనార్హం. అయితే ముడి చమురు, సహజ వాయువుల ఉత్పత్తి 2016 నవంబర్‌లో మైనస్ 5.4 శాతం, మైనస్ 1.7 శాతానికి పడిపోయాయి.