బిజినెస్

7 శాతం క్షీణించిన యువాన్ విలువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జనవరి 2: చైనా కరెన్సీ యువాన్ విలువ 2016 సంవత్సరంలో 7 శాతం పడిపోయింది. 1994 నుంచి గమనిస్తే ఈ స్థాయిలో డ్రాగన్ కరెన్సీ విలువ పడిపోవడం ఇదే తొలిసారి. కాగా, యువాన్ విలువ కొలమానానికి మరో 11 కరెన్సీలను చైనా చేర్చుకోగా, ఇప్పటికే ఉన్న 13 కరెన్సీలతోపాటు ఈ 11 కరెన్సీలతో యువాన్ విలువను లెక్కించనున్నారు. మరోవైపు దేశంలోని విదేశీ మారకద్రవ్య నిల్వల్లో అమెరికా డాలర్ల వాటాను చైనా తగ్గించుకుంది. 26.4 శాతం నుంచి 22.4 శాతానికి దించింది. యువాన్ కరెన్సీ విలువను సరిచేయడానికే ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, కొత్తగా చేర్చుకున్న కరెన్సీల్లో దక్షిణ కొరియా వోన్, స్వీడన్ క్రోనా, సౌదీ రియాల్, దక్షిణాఫ్రికా రాండ్, హంగేరి ఫోరింట్, టర్కీ లిరా తదితర దేశాల కరెన్సీలున్నాయి.