బిజినెస్

అరకు కాఫీకి భలే డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 2: ఈ సంవత్సరంలో నాలుగు వేల మెట్రిక్ టన్నుల కాఫీ గింజలను (పంట) దేశీయ మార్కెట్‌లో విక్రయించాలని గిరిజన సహకార సంస్థ (జిసిసి) లక్ష్యంగా పెట్టుకుంది. ఐటిడిఎ, జిసిసి ఆధ్వర్యంలో పదేళ్ళ సంయుక్త ప్రాజెక్టు కింద అరకు కాఫీ వ్యాపార లక్ష్యాలను మరింతగా పెంచాలని సంస్థ నిర్ణయించింది. నిరుడు (2016) తొలిసారిగా రెండు వేల మెట్రిక్ టన్నుల కాఫీ పంటని అందుబాటులోకి తీసుకురాగలిగింది. దీనిని దేశీయ మార్కెట్‌లోకి దించడంతో ఊహించని విధంగా ఆదరణ లభించింది. మార్కెట్‌లో అరకు కాఫీకి ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈ ఏడాది లక్ష్యాలను రెట్టింపు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రెండవ ఏడాది కాఫీ ప్రాజెక్టును మరింతగా అభివృద్ధి చేయడం ద్వారా గిరిజనులకు ప్రయోజనం కల్పించాలని జిసిసి నిర్ణయించింది. నిరుడు ఏకంగా 1,400 మెట్రిక్ టన్నుల కాఫీని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా దేశీయ మార్కెట్‌తోపాటు దీనికి విశేషమైన ఆదరణ లభించింది. దీనివల్ల ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ జిల్లా అరకు, అనంతగిరి, పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట తదితర ఏజెన్సీ మండలాల్లో దాదాపు లక్ష ఎకరాల్లో కాఫీ పంటను గిరిజన రైతులు పండించే విధంగా ఐటిడిఎ ప్రోత్సహిస్తోంది. ఈ విధంగా గిరిజనులు పండించిన అరకు కాఫీ పంటకు మధ్యవర్తిగా జిసిసి వ్యవహరిస్తూ దేశీయ మార్కెట్‌లో డిమాండ్ పెరిగేలా చేస్తుండగా, దీనివల్ల దళారీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించినట్టు అవుతోంది. అలాగే పదివేల మందికిపైగా గిరిజన రైతు సభ్యులకు 11.21 కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని కల్పించగలిగింది. ఎటువంటి లాభం ఆశించకుండా, నష్టాన్ని చూడకుండా గిరిజన రైతులకు ప్రయోజనం కలిగేలా సాగును నిర్వహించడమే పదేళ్ళ కాఫీ ప్రాజెక్టు లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు. మరోవైపు కాఫీ పంట ఈ నెల నుంచి అందుబాటులోకి రానున్నందున ఇప్పటి నుంచే దీనిపై ప్రత్యేక దృష్టిపెడుతున్న జిసిసి అధికారులు.. బృందాలుగా ఏర్పడి ఏజెన్సీ మండలాల్లో వీటి అభివృద్ధికి తగిన చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా గిరిజన రైతులకు అవగాహన కల్పించడం, దళారీ వ్యవస్థను నిర్మూలించడంపైనే దృష్టిసారిస్తున్నారు. అలాగే కాఫీ విస్తీర్ణం మరింతగా పెంచి లాభసాటిగా చేసేందుకు అధికారులు ప్రతి మండల పరిధిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
అందుబాటులోకి ఇన్‌స్టెంట్ కాఫీ
అరకు కాఫీతోపాటు ఈ ఏడాది నుంచి సామాన్యులకు అందుబాటులోకి ఉండే విధంగా ఇన్‌స్టెంట్ కాఫీ ప్యాకెట్లను మార్కెట్‌లోకి దించుతోంది జిసిసి. లాభసాటి కోసం కాకుండా అరకు కాఫీకి ఆదరణ పెరిగేలా, గిరిజన రైతులకు మేలు జరిగేలా చూడాలనేదే ఇందులో జిసిసి లక్ష్యం. ఇప్పటికే వైశాఖీ బ్రాండ్‌తో కాఫీని లాభసాటిగా మార్కెట్ చేసుకోగలుగుతున్న జిసిసి.. ఇన్‌స్టెంట్ కాఫీ ప్యాకెట్లతో అమ్మకాలను పెంచుకోవాలని నిర్ణయంచింది. ఈ విధంగా కాఫీ బోర్డుకు దీటుగా లక్ష్యాలను అధిగమించే క్రమంలో ఐటిడిఎ, జిసిసి ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయ.

చిత్రాలు..విశాఖపట్నం జిల్లా అనంతగిరిలో సాగవుతున్న కాఫీ పంట, *కాఫీ గింజలను సేకరిస్తున్న గిరిజన మహిళలు