బిజినెస్

మరోసారి విశాఖ వేదికగా పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 3: ఈ నెల 27-28 తేదీల్లో కనె్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) ఆధ్వర్యంలో వరుసగా రెండో ఏట పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు విశాఖపట్నంలో జరగనుంది. ప్రపంచ ఆర్థిక సుస్థిరతలో భాగస్వామ్యమయ్యేలా దీన్ని నిర్వహిద్దామని సిఎంఓ, ఇంధన, సిఆర్‌డిఎ, వౌలిక, పెట్టుబడులు, పర్యాటక, చేనేత-జౌళి, ఆహార తయారీ శాఖల అధికారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ సదస్సులో పారిశ్రామిక సంస్థలకు ఆంధ్రప్రదేశ్ స్నేహ హస్తం అందిస్తుందన్న భరోసాను కల్పించాలని, ఇందుకు నిరుడు నిర్వహించిన పారిశ్రామిక సమ్మిట్‌లో చేసుకున్న ఒప్పందాలు, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో స్థాపించిన పరిశ్రమలు, పారిశ్రామికవేత్తల అనుభవాలను తెలియజేసేలా కార్యక్రమాన్ని సన్నద్ధం చేయాలని వివిధ విభాగాల అధికారులకు చంద్రబాబు సూచించారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రం పెట్టుబడుల ‘‘ప్రధాన వనరు’’ అనే విశ్వాసాన్ని కల్పించాలని, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు భవిష్యత్తుపై భరోసా కల్పించేలా ఈ పారిశ్రామిక సదస్సు జరగాలని, ఇందుకోసం ఏర్పాట్లు ముమ్మరం చేయాలని అధికారులతో అన్నారు. ఈ క్రమంలోనే ఏర్పాట్లపై బుధవారం అధికారులతో సమీక్షను నిర్వహించనున్నారు. కాగా, మంగళవారం సిఎంఓ, ఇంధన, సిఆర్‌డిఎ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు.
ఈ టెలికాన్ఫరెన్స్‌లో సిఎంఓ ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఎపి ట్రాన్స్‌కో సిఎండి కె విజయానంద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోగ్యకియారాజ్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ కార్తికేయ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం వివరాలను ఇంధన, పెట్టుబడులు, వౌలిక సదుపాయాలు, సిఆర్‌డిఎ మీడియా సలహాదారు ఎ చంద్రశేఖర రెడ్డి విలేఖరులకు వెల్లడించారు.
రాష్ట్ర విభజన జరిగాక తొలిసారిగా నిరుడు జనవరి 10-12 తేదీల మధ్య విశాఖలో నిర్వహించిన పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు విజయవంతమయ్యిందని, ఈ సదస్సులో చేసుకున్న ఒప్పందాలు ఫలప్రదమవుతున్నాయని, వాటిని ఈ సదస్సులో ప్రత్యేకంగా ఒక ప్రదర్శన రూపంలో చూపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారన్నారు. రాష్ట్రంలో ఇంధన, పరిశ్రమల శాఖ సమర్థవంతంగా పనిచేస్తోందని, 24 గంటలూ విద్యుత్‌ను ఇస్తోందని, పారిశ్రామిక సంస్థలు దరఖాస్తు చేసిన వెంటనే విద్యుత్ కనెక్షన్ ఇచ్చే స్థాయిలో ఉందని సిఎం చంద్రబాబు ప్రశంసించారని చెప్పారు. కాగా, పరిశ్రమలతోపాటు రాష్ట్రంలో ఏ వినియోగదారుడు కోరినా వెంటనే కనెక్షన్ ఇస్తున్నామని అజయ్ జైన్ వివరించారు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలపై దృష్టి సారించామని, కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడ్డ కొద్ది క్షణాల్లోనే పునరుద్ధరణ జరిగేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. విశాఖలో వీధి దీపాలపై ప్రయోగాత్మకంగా చేపట్టిన సాంకేతిక పరిజ్ఞానం విజయవంతం అయ్యిందని, దీనిని రాష్టమ్రంతటికి విస్తరించామని, త్వరలోనే దీనిపై నివేదిక ఇవ్వనున్నామని తెలిపారు.
ఇదిలావుంటే సమావేశం సందర్భంగా సదస్సు కార్యాచరణను పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆరోగ్యకియారాజ్, డైరెక్టర్ కార్తికేయ మిశ్రా ముఖ్యమంత్రికి వివరించారు. ఈసారి ప్రపంచ ఆర్థిక గమనంలో సుస్థిర అభివృద్ధి అనే థీమ్‌తో సదస్సును చేపడుతున్నామని చెప్పారు. పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన పోటీదారుగా ప్రపంచానికి తెలియజేసేందుకు తగు ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. భవిష్యత్తు వృద్ధికి దోహదపడే అంశాలపై సంప్రదింపులు, చర్చలు జరిపేందుకు వీలైన వేదికగా ఈ సదస్సును తీర్చిదిద్దనున్నామని స్పష్టం చేశారు. ప్రపంచ అభివృద్ధిలో ప్రాధాన్యాలు, సదుపాయాల విధానాలు, చేయాల్సిన మార్పులపై సమీక్షిస్తామని చెప్పారు. ఈ సదస్సులో సుమారు 2 వేల మందికిపైగా ప్రతినిధులు పాల్గొంటారని, అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో పెరెన్నికగన్న సంస్థలు భాగస్వామ్యం అవుతున్నాయని వివరించారు. సింగపూర్, మలేషియా, యుఎఇ, ఉక్రేయిన్ తదితర 12 దేశాల వాణిజ్య శాఖ మంత్రులు సదస్సులో పాల్గొంటామంటూ సమ్మతిని తెలిపారని తెలియజేశారు. సదస్సులో తొమ్మిది ప్లీనరీలు ఉండేలా ఏర్పాటు చేశామన్నారు. ఎయిరో స్పేస్, రక్షణ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, బయోటెక్, ఫార్మా, వ్యవసాయ, ఆహార తయారీ, జౌళి రంగాలకు చెందిన 10 మంది ప్రముఖ సీఈఓలు హాజరు కానున్నారని పేర్కొన్నారు. వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక సంస్థలతో అవగాహన ఒప్పందాలను చేసుకునేందుకు సిద్ధమయ్యామని అన్నారు. సదస్సుకు ‘సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్’ పేరిట ఏర్పాటు చేసే పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా మారనున్నదని చెప్పారు.
పరిశ్రమల శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న మేకిన్ ఇండియా పెవిలియన్ ప్రత్యేకతను చాటుకోనున్నదన్నారు. తయారీ, యంగ్ ఇన్నోవేటర్, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, స్టార్టప్ రంగాలతో సహా వాణిజ్యం, సుస్థిర స్టార్టప్, ఇన్నోవేషన్‌లో అవార్డులను అందించనున్నామని చెప్పారు. దీంతో వీటిపై బుధవారం కూలంకషంగా చర్చిద్దామని సిఎం చంద్రబాబు నాయుడు సదరు అధికారులకు సూచించారు.