బిజినెస్

కొత్త కరెన్సీలో 40 శాతం గ్రామాలకు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 3: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కొత్తగా వస్తున్న కరెన్సీలో కనీసం 40 శాతం గ్రామీణ ప్రాంతాలకు పంపాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కోరింది. పేద, సన్నకారు రైతులకు నగదు కొరత సమస్య రాకుండా చూడాలని సూచించింది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం నవంబర్ 8వ తేదీ రాత్రి పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినద తెలిసిందే. ఈ క్రమంలో రద్దయిన నోట్లను బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని, వాటికి సమాన విలువైన కొత్త 500, 2,000 రూపాయల నోట్లను తీసుకోవచ్చని మోదీ చెప్పారు. అయితే రెండు నెలలు అవుతున్నా నగదు కొరత వేధిస్తూనే ఉండగా, నగర, పట్టణ అవసరాలకే బ్యాంకులు తమ వద్దకు వచ్చిన కరెన్సీని అధికంగా వాడుతున్నాయి. దీంతో గ్రామీణ ప్రజలకు నోట్ల కష్టాలు తప్పట్లేదు. ఈ క్రమంలోనే బ్యాంకులకు చేరుతున్న కొత్త నోట్లలో 40 శాతాన్ని గ్రామాల్లోని బ్యాంకులకు అందేలా చూడాలని ఆయా ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ అధిపతులకు ఆర్‌బిఐ మార్గనిర్దేశకాలు ఇచ్చింది. బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతూనే ఉండగా, ఎటిఎమ్‌ల ముందు జనం బారులుతీరి కనిపిస్తూనే ఉన్నారు.
అక్రమాలపై ఆరా
న్యూఢిల్లీ: మరోవైపు పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆయా బ్యాంకుల్లో చోటుచేసుకున్న అక్రమాలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆరా తీస్తోంది. రద్దయిన నోట్ల మార్పిడికి అక్రమంగా సహకరించిన ఉదంతాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున బయటపడినది తెలిసిందే.
అవినీతిపరులతో చేతులు కలిపిన బ్యాంక్ అధికారులు, ఉద్యోగులు.. స్వలాభం కోసం దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.
ఇప్పటికే అక్రమాలకు పాల్పడుతూ పట్టుబడినవారిపై కఠిన చర్యలకు ఆదేశించగా, క్షేత్రస్థాయిలో జరిగిన అవకతవకలపైనా దృష్టి సారించింది. ఇందులోభాగంగానే నోట్ల మార్పిడిలో జరిగిన అక్రమాలతో ప్రమేయమున్న అధికారుల వివరాలను అందించాలని ప్రభుత్వరంగ బ్యాంకులను ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది.