బిజినెస్

బిఎస్‌ఇ ఐపిఒకు లైన్‌క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఇ) పబ్లిక్ ఇష్యూకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అనుమతినిచ్చింది. ఆసియా ఖండంలోనే అంత్యంత ప్రాచీన ఎక్స్‌చేంజ్ అయిన బిఎస్‌ఇ.. ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) ద్వారా 1,500 కోట్ల రూపాయల నిధులను సమీకరించవచ్చని అంచనా. ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్‌ఎస్) ద్వారా బిఎస్‌ఇలోని ప్రస్తుత భాగస్వాములు ఈ ఐపిఒలో 2,99,55,434 షేర్లను అమ్మకానికి పెట్టనున్నారు. బిఎస్‌ఇలోని ప్రస్తుత భాగస్వాముల్లో బజాజ్ హోల్డింగ్స్ ఇనె్వస్ట్‌మెంట్, కాల్డ్‌వెల్ ఇండియా హోల్డింగ్స్, అకేషియా బన్యన్ పార్ట్‌నర్స్, సింగపూర్ ఎక్స్‌చేంజ్‌తోపాటు మారిషస్‌కు చెందిన అమెరికన్ ఇనె్వస్టర్ జార్జ్ సోరోస్ అనుబంధ సంస్థలైన క్వాంటమ్ ఫండ్, ఫారిన్ ఫండ్ అటిక్యుస్ తదితర సంస్థలున్నాయి. ఒక్కో షేర్ ధర 500 రూపాయలుగా నిర్ణయించనుండగా, అన్ని షేర్లు అమ్ముడైతే దాదాపు 1,500 కోట్ల రూపాయల నిధులు సమకూరనున్నాయి. త్వరలోనే ఐపిఒ రానుండగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ)లో బిఎస్‌ఇ షేర్లు లిస్టవనున్నాయి. సెబీ నిబంధనల ప్రకారం ఏ స్టాక్ ఎక్స్‌చేంజ్ అయినాసరే తనకు తాను లిస్టింగ్ చేసుకోకూడదు. దీంతో ఎన్‌ఎస్‌ఇలో బిఎస్‌ఇ షేర్ల ట్రేడింగ్ జరుగుతుంది. కాగా, నిరుడు సెప్టెంబర్‌లో సెబీకి ఐపిఒ డ్రాఫ్ట్ పేపర్లను బిఎస్‌ఇ సమర్పించింది. ఇటీవలే నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) కూడా సెబీకి ఐపిఒ డ్రాఫ్ట్ పేపర్లను ఇచ్చినది తెలిసిందే. ఎన్‌ఎస్‌ఇ ఐపిఒకు సెబీ అనుమతిస్తే, బిఎస్‌ఇలో ఎన్‌ఎస్‌ఇ షేర్లు లిస్టవనున్నాయి. 10,000 కోట్ల రూపాయల సమీకరణే లక్ష్యంగా ఈ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది ఎన్‌ఎస్‌ఇ. డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డిఆర్‌హెచ్‌పి) ప్రకారం ఒఎఫ్‌ఎస్ పేరిట ఎన్‌ఎస్‌ఇలో ప్రస్తుతమున్న భాగస్వాములు తమ షేర్లలో 11 కోట్లకుపైగా షేర్లను ఈ ఐపిఒ ద్వారా అమ్మనున్నారు. కాగా, కోల్ ఇండియా తర్వాత ప్రభుత్వరంగ సంస్థల్లో భారీ నిధుల సమీకరణతో స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశిస్తున్న సంస్థ ఎన్‌ఎస్‌ఇనే. ఐపిఒ విజయవంతమైతే ఎన్‌ఎస్‌ఇ విలువ 50,000-55,000 కోట్ల రూపాయలకు చేరే అవకాశముంది. ప్రస్తుతం దేశంలో స్టాక్ మార్కెట్లలో లిస్టయన ఎక్స్‌చేంజ్ కేవలం ఎమ్‌సిఎక్స్ మాత్రమే. త్వరలో బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇ కూడా ఈ జాబితాలో చేరనున్నాయ.
లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. కొత్త సంవత్సరం ఆరంభం వేళ సోమవారం సూచీలు నష్టపోయినది తెలిసిందే. ఈ క్రమంలో తిరిగి కోలుకోగా, బిఎస్‌ఇ సూచీ సెనె్సక్స్ 47.79 పాయింట్లు పుంజుకుని 26,643.24 వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఇ సూచీ నిఫ్టీ 12.75 పాయింట్లు పెరిగి 8,192.25 వద్ద నిలిచింది. నవంబర్‌లో వౌలిక రంగం పనితీరు మెరుగుపడటంతోపాటు కలిసొచ్చిన అంతర్జాతీయ సానుకూల సంకేతాలు.. మదుపరులను కొనుగోళ్ల వైపు నడిపించాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, చమురు, గ్యాస్, పిఎస్‌యు, పవర్, ఇన్‌ఫ్రా రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బిఎస్‌ఇ స్మాల్-క్యాప్ 1.03 శాతం, మిడ్-క్యాప్ 0.61 శాతం మేర లాభపడ్డాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, చైనా సూచీలు లాభపడితే, జపాన్ మార్కెట్‌కు సెలవు. ఇక ఐరోపా మార్కెట్లలో జర్మనీ, ఫ్రాన్స్, లండన్ మార్కెట్లూ లాభాల్లో కదలాడాయి.