బిజినెస్

ప్రభుత్వాఫీసుల్లో ఇక క్యాష్‌లెస్ లావాదేవీలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 6: ఆంధ్ర రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలు అధికంగా జరిగేలా ప్రభుత్వం పలు మార్గాల్లో చర్యలు తీసుకుంటోంది. ఈ విధానం ద్వారా ప్రస్తుతం దేశంలో నెలకొన్న నోట్ల కొరతతోపాటు చిల్లర సమస్యను సులభంగా అధిగమించ వచ్చునని సర్కారు భావిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో నగదు రహిత లావాదేవీలు వంద శాతం మేర జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం భారీగా ఈ-పోస్ మిషన్లను అందుబాటులో ఉంచేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థల్లోనే కాకుండా ప్రైవేట్ సంస్థల్లోనూ ఈ-పోస్ మిషన్లను ఉపయోగించేలా చర్యలు తీసుకుంటున్నారు. నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు పెద్దఎత్తున ప్రణాళికలు రూపొందించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ-పోస్ మిషన్లను విస్తృతంగా వినియోగించనున్నారు. ఇప్పటికే అన్ని శాఖల్లో ఈ మిషన్లను వినియోగిస్తున్నారు. శాఖల వారీగా వారికి కావలసిన మిషన్లను అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, ఎపిఎస్‌ఆర్టీసీ, మీసేవ, సివిల్ సప్లై, రైతుబజార్, చెక్‌పోస్టు, లేబర్ డిపార్ట్‌మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ లాంటి 11 డిపార్ట్‌మెంట్లకు కలిపి ఇప్పటివరకు దాదాపు 16 వేల మిషన్లను మంజూరు చేశారు. ఈ-పోస్ మిషనే్ల కాకుండా వేలిముద్రల ద్వారా చెల్లింపులు చేసే మిషన్ల సేకరణపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. నగదు రహిత కార్యకలాపాలకు కార్డులు, ఫోన్లతోనే చెల్లింపులు చేయడమే కాకుండా ఆధార్ కార్డు ఆధారంగా వేలిముద్రతో కూడా చెల్లింపులు జరిగేలా చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ విధానాన్ని పలుచోట్ల అమలు చేస్తున్నారు. ఇప్పటికే స్కానర్లు ఐదువేల వరకు వినియోగంలో ఉన్నాయి. త్వరలో మరో 45 వేల వేలిముద్రల స్కానర్లను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఈ స్కానర్లకు అయ్యే ఖర్చులో సగం ధరకే దుకాణదారులకు అందించాలని నిర్ణయించింది. మిగిలిన మొత్తాన్ని సబ్సిడీగా అందజేయనుంది. కాగా, ప్రభుత్వ కార్యాలయాల పరంగా చూస్తే, ఇప్పటికే కొన్ని కార్యాలయాలకు ప్రభుత్వం ఈ-పోస్ మిషన్లను అందజేసింది. జనవరి 5 నాటికి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు 8,818, ఆర్టీసీకి 700, ఐజీఆర్‌ఎస్‌లో 40 మిషన్లు, లేబర్ డిపార్ట్‌మెంట్‌కు 910 మిషన్లు అందజేశారు. వీలైనంత త్వరగా మిగిలిన డిపార్ట్‌మెంట్లను కూడా ఈ-పోస్ మిషన్లతో భర్తీ చేయనున్నారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే శాఖల్లో ఒకటైన వాణిజ్య పన్నుల శాఖలో అత్యధిక ఈ పోస్ మిషన్లు ఉన్నాయ. ఈ శాఖలో ఇప్పటికే రాష్టవ్య్రాప్తంగా 33,022 మిషన్లు ఉన్నాయి. ఇంకా అవసరమైన మిషన్లను త్వరలోనే అందజేయడానికి అధికారులు కృషి చేస్తున్నారు. ఇదిలా వుండగా జిల్లాల వారీగా మీసేవ కేంద్రాల్లో నగదు ద్వారా ఎంతమేర లావాదేవీలు జరిగాయి.. నగదు రహితంగా ఎంత జరిగాయ? అనేది అంచనా వేస్తున్నారు. మరోవైపు మీ సేవకు కావలసిన ఈ పోసులను వివిధ బ్యాంకర్లు అందించారు. మొత్తానికి నగదు రహిత లావాదేవీలు జరిగేలా ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. వీలైనంత త్వరగా మరిన్ని మిషన్లను తెప్పించి రాష్ట్రంలో అన్ని శాఖల్లోనూ నగదు రహిత లావాదేవీలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 31 నాటికి 50వేల మిషన్లను మంజూరు చేయనున్నారు. కాగా, నగదు రహిత లావాదేవీలపై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు జన్మభూమి-మా ఊరు కార్యక్రమం వేదికగా చేసుకుంది ప్రభుత్వం. ప్రతి గ్రామ సభలోనూ నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన వచ్చేలా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. బ్యాంక్ అధికారులు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు నగదు రహిత లావాదేవీలపై చైతన్యం కల్పిస్తున్నారు.