బిజినెస్

జిడిపి వృద్ధిరేటు 7.1 శాతమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 6: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో దేశ జిడిపి వృద్ధిరేటు 7.1 శాతంగా ఉండవచ్చని కేంద్రం అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో ఇది 7.6 శాతంగా ఉండటం గమనార్హం. తయారీ, గనులు, నిర్మాణ రంగాల్లో నెలకొన్న మందగమనమే జిడిపి వృద్ధిరేటు తగ్గుదలకు కారణమని శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో ప్రభుత్వం పేర్కొంది. అయితే పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావం మాత్రం కాదంది. కేంద్ర గణాంకాల కార్యాలయం (సిఎస్‌ఒ) ముఖ్య గణాంకవేత్త టిసిఎ అనంత్ విడుదల చేసిన ఈ గణాంకాల్లో ‘పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్లే జిడిపి వృద్ధిరేటు పడిపోనుందని చెప్పలేం. నోట్ల రద్దుతోపాటు మరే ప్రభుత్వ నిర్ణయాలూ జిడిపి వృద్ధికి భంగం కలిగించలేదు.’ అని అనంత్ అన్నారు. మరోవైపు పాత పెద్ద నోట్ల రద్దు వల్లే దేశ జిడిపి వృద్ధిరేటు అంచనాలు పతనమవుతున్నాయని జాతీయ, అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు ఏకరువుపెడుతున్నది తెలిసిందే. ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియానైతే ఏకంగా ఈసారి భారత జిడిపి వృద్ధిరేటు 5 శాతానికే పరిమితం కావచ్చని అంచనా వేశారు. ఎస్‌బిఐ రిసెర్చ్ కూడా 6.7 శాతానికి తగ్గించింది.
లక్ష మార్కు దాటొచ్చు
మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతీయుల తలసరి ఆదాయం లక్ష రూపాయల మార్కును దాటవచ్చని సిఎస్‌ఒ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇది 93,293 రూపాయలుగా ఉందంది.