బిజినెస్

కృష్ణపట్నం పోర్టులో బ్యాగేజ్ స్కానర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముత్తుకూరు, జనవరి 9: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఓడరేవులోని కస్టమ్స్ కార్యాలయంలో సోమవారం బ్యాగేజ్ స్కానర్‌ను కస్టమ్స్ కమిషనర్ ఎస్‌కె రెహమాన్ పోర్టు సిఇఒ అనిల్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. బ్యాగేజ్ స్కానర్‌తోపాటు మెటల్ డిటెక్టర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కస్టమ్స్ కమిషనర్ మాట్లాడుతూ పోర్టులో భద్రతా చర్యల్లో భాగంగా కోటీ రూపాయల విలువ చేసే బ్యాగేజ్ స్కానర్‌తోపాటు మెటల్ డిటెక్టర్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఇది శుభపరిణామంగా పేర్కొన్నారు. అనిల్‌కుమార్ మాట్లాడుతూ బ్యాగేజ్ స్కానర్ ప్రారంభం వల్ల రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కృష్ణపట్నం పోర్టు ప్రధాన పాత్ర పోషిస్తుందని అనడంలో ఎలాంటి సందేహాం లేదన్నారు.