బిజినెస్

కొనాలా?.. వద్దా?..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 9: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్)గాను ఆయా ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలు తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించే సమయం ఆసన్నమవడంతో మదుపరులు పెట్టుబడులపట్ల ఆచితూచి వ్యవహరించారు. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 32.68 పాయింట్లు కోల్పోయి 26,726.55 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 7.75 పాయింట్లు పడిపోయి 8,236.05 వద్ద నిలిచింది. రియల్టీ, ఐటి, ఎఫ్‌ఎమ్‌సిజి, చమురు, గ్యాస్, హెల్త్‌కేర్, ఎనర్జీ, పవర్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో చైనా, సింగపూర్, హాంకాంగ్ సూచీలు లాభపడగా, ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ సూచీలకు నష్టాలు, బ్రిటన్‌కు లాభాలు వచ్చాయి.