బిజినెస్

ఇంటర్నెట్ టెలిఫోనీపై త్వరలో సిఫారసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 12: దేశంలో ఇంటర్నెట్ టెలిఫోనీ నిబంధనలకు సంబంధించిన సిఫారసులను ఫిబ్రవరి నెలాఖరులోగా ఖరారు చేయాలని టెలికామ్ నియంత్రణా సంస్థ (ట్రాయ్) యోచిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ రకాల మొబైల్ అప్లికేషన్ల (యాప్స్) ద్వారా వినియోగదారులు చౌకగా ఫోన్‌కాల్స్ చేసుకునేందుకు ఇది ఉపకరిస్తుంది. ఇంటర్నెట్ టెలిఫోనీని అందుబాటులోకి తీసుకురావాలన్న నిబంధన టెలికామ్ లైసెన్సులో ఉన్నప్పటికీ దేశంలో ఈ సేవలు విస్తరించలేదని, ఇందుకు ప్రతిబంధకంగా ఉన్న అంశాలపై గురువారం చర్చించామని ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్.శర్మ తెలిపారు. ఇంటర్నెట్ టెలిఫోనీపై న్యూఢిల్లీలో గురువారం నిర్వహించిన బహిరంగ చర్చ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ చర్చా పత్రానికి సంబంధించిన సిఫారసులను ఫిబ్రవరి నెలాఖరులోగా ఖరారు చేయాలని తాము భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ అంశంపై ట్రాయ్ జూన్‌లోనే సంప్రదింపులను ప్రారంభించింది. దేశంలో ప్రస్తుతం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ఐఎస్‌పిలు) మాత్రమే పిసి నుంచి పిసికి (కంప్యూటర్ నుంచి కంప్యూటర్‌కి) ఇంటర్నెట్ టెలిఫోనీ సేవలను అందిస్తున్నాయి. అయితే సాంకేతిక పరిజ్ఞానం మరింత అభివృద్ధి చెందడంతో వాట్సాప్, స్కైప్ లాంటి వివిధ రకాల యాప్స్ ద్వారా మొబైల్ ఫోన్ల నుంచి కూడా వాయిస్ కాల్స్ చేసుకునేందుకు వీలవుతోంది. సాంప్రదాయ టెలిఫోనీ మాదిరిగానే ఇంటర్నెట్ టెలిఫోనీ కూడా ఇప్పుడు బాగా అభివృద్ధి చెందిందని, ల్యాండ్‌లైన్లు లేదా మొబైల్ ఫోన్ల ద్వారా ఫోన్‌కాల్స్ చేసుకునేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సర్వీస్ ప్రొవైడర్లు ప్రత్యక్షంగా పోటీ పడాలని ట్రాయ్ స్పష్టం చేసింది.