బిజినెస్

టాటా సన్స్ చైర్మన్‌గా చంద్రశేఖరన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 12: దేశంలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థల్లో ఒకటైన టాటా సన్స్ తమ సంస్థ కొత్త చైర్మన్‌గా అనుబంధ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) సిఇఓ నటరాజన్ చంద్రశేఖరన్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం తమ సంస్థకు తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరిస్తున్న రతన్ టాటాతో పాటు ఇటీవల చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్ర్తి స్థానంలో చంద్రశేఖరన్‌ను నియమిస్తున్నట్లు టాటా సన్స్ స్పష్టం చేసింది. రతన్ టాటా అధ్యక్షతన గురువారం జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. టాటా సన్స్ చైర్మన్ పదవి కోసం పెప్సీకో సంస్థ అధిపతి ఇంద్రా నూరుూ, వొడాఫోన్ గ్రూపు మాజీ అధిపతి అరుణ్ సరీన్, టాటా రిటైల్ యూనిట్ ‘ట్రెంట్’ చైర్మన్ నోయెల్ టాటా లాంటి ఎంతో మంది మహామహుల పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ చివరికి చంద్రశేఖరన్‌ను ఆ పదవికి ఎంపిక చేశారు. టాటా సన్స్ సంస్థకు కొత్త చైర్మన్‌ను ఎంపిక కోసం ఐదుగురు సభ్యులతో ఏర్పాటైన కమిటీకి గడువుగా నిర్దేశించిన ఫిబ్రవరి 24వ తేదీ సమీపించడానికి నెల రోజులకు పైగా ముందుగానే చంద్రశేఖరన్‌ను ఈ పదవిలో నియమించారు. గత అక్టోబర్ 24వ తేదీన తమ సంస్థ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్ర్తికి ఉద్వాసన పలికి కార్పొరేట్ ప్రపంచాన్ని నివ్వెరపరచిన టాటా సన్స్ ఆ మరుక్షణం నుంచే కొత్త చైర్మన్ కోసం అనే్వషణ ప్రారంభించింది. సైరస్ మిస్ర్తిని తొలగించిన తర్వాత నాలుగు నెలల్లోగా కొత్త చైర్మన్‌ను ఎంపిక చేసేందుకు టాటా సన్స్ డైరెక్టర్ల బోర్డు ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో సంస్థ అధినేత రతన్ టాటాతో పాటు టివిఎస్ గ్రూపు అధిపతి వేణు శ్రీనివాసన్, బైన్ క్యాపిటల్ సంస్థకు చెందిన అమిత్ చంద్ర, మాజీ దౌత్యాధికారి రొనెన్ సేన్, లార్డ్ కుమార్ భట్టాచార్య సభ్యులుగా ఉన్నారు.

చిత్రం..టాటా సన్స్ కొత్త అధిపతిగా ఎంపికైన నటరాజన్ చంద్రశేఖరన్