బిజినెస్

బిఎస్‌ఇ ఐపిఒ ధరల శ్రేణి రూ. 805-806

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఇ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)లో ఒక్కో షేర్ ధరను 805-806 రూపాయలుగా నిర్ణయించారు. 1,243 కోట్ల రూపాయల నిధుల సమీకరణే లక్ష్యంగా ఈ పబ్లిక్ ఇష్యూకు బిఎస్‌ఇ దిగుతోంది. మూడు రోజులపాటు జరగనున్న ఈ ఐపిఒ.. ఈ నెల 23న ప్రారంభమై, 25న ముగుస్తుంది. ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూల్లో బిఎస్‌ఇదే మొదటిది. 15.43 మిలియన్ షేర్లను బిఎస్‌ఇ ఈ సందర్భంగా విక్రయించనుంది. ఈ షేర్లన్నీ గరిష్ఠ స్థాయిలో అమ్ముడైతే 1,243 కోట్ల రూపాయల నిధులు అందుతాయని అంచనా. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ)లోనే బిఎస్‌ఇ షేర్లు లిస్టవుతాయి. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిబంధనల ప్రకారం సొంత ఎక్స్‌చేంజ్‌లో షేర్ల లిస్టింగ్ లేదు. ఇక బిఎస్‌ఇకి ఇటీవలే పబ్లిక్ ఇష్యూకు సంబంధించి సెబీ అనుమతినిచ్చిన నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఇ కూడా సెబీకి ఐపిఒ పత్రాలను సమర్పించింది. 10,000 కోట్ల రూపాయల నిధుల సమీకరణే లక్ష్యంగా ఈ ఐపిఒ రానుంది. ఇదిలావుంటే బిఎస్‌ఇలో భాగస్వాములుగా బజాజ్ హోల్డింగ్స్ ఇనె్వస్ట్‌మెంట్, కాల్డ్‌వెల్ ఇండియా హోల్డింగ్స్, అకేసియా బన్యన్ పార్ట్‌నర్స్, సింగపూర్ ఎక్స్‌చేంజ్, మారిషస్‌కు చెందిన అమెరికన్ ఇనె్వస్టర్ జార్జ్ సారోస్ క్వాంటమ్ ఫండ్, ఫారిన్ ఫండ్ అటికస్ ఉన్నాయి. ఈ పబ్లిక్ ఇష్యూను ఎడిల్‌వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, యాక్సిస్ క్యాపిటల్, జెఫ్ఫెరీస్ ఇండియా, నొమురా ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, మోతీలాల్ ఓస్వాల్ ఇనె్వస్ట్‌మెంట్ అడ్వైజర్స్, ఎస్‌బిఐ క్యాపిటల్ మార్కెట్స్, ఎస్‌ఎమ్‌సి క్యాపిటల్స్ నిర్వహిస్తున్నాయి. దేశీయ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లలో స్టాక్ మార్కెట్లలో లిస్టయినది ఇప్పటివరకు ఒక్క మల్టీ కమాడిటీ ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఇండియానే. ఇప్పుడు బిఎస్‌ఇ కూడా దీని సరసన నిలువనుండగా, త్వరలో ఎన్‌ఎస్‌ఇకీ ఆ అవకాశం లభించనుంది.