బిజినెస్

రుతుపవనాలపై అంచనా నిజమైతే వృద్ధిరేటు పరుగులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 14: దేశంలో ఈ ఏడాది రుతుపవనాలు మెరుగ్గా ఉంటాయని, వర్షపాతం సాధారణ సగటు కంటే అధికంగా నమోదవుతుందని చెబుతున్న వాతావరణ నిపుణుల అంచనాలు నిజమైతే భారత ఆర్థికాభివృద్ధి మరింత వేగాన్ని పుంజుకుని గత ఆర్థిక సంవత్సరం సాధించిన స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) రేటు (7.5 శాతం) కంటే మరింత మెరుగైన వృద్ధిరేటును సాధించడం ఖాయమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్య పరిస్థితులు నెలకొనడం వలన అంతర్జాతీయ ఎగుమతులు క్షీణించడంతో పాటు దేశంలో వరుసగా రెండేళ్లు రుతుపవనాల లోటు ఏర్పడినప్పటికీ గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో భారత్ 7.5 శాతం వృద్ధిరేటు సాధించిన విషయం విదితమే. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17)లో రుతుపవనాలు బలం పుంజుకుని పరిస్థితులు మెరుగవుతాయన్న నిపుణుల అంచనాలు నిజమైతే దేశ ఆర్థికాభివృద్ధి రేటు మరింత మెరుగుపడుతుందని అరుణ్ జైట్లీ అన్నారు. అమెరికాలో ఏడు రోజుల పర్యటన ప్రారంభించిన జైట్లీ బుధవారం తొలి రోజు వాషింగ్టన్‌లో బుధవారం ‘కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్’ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ‘స్టీరింగ్ ఇండియా టువర్డ్స్ గ్రోత్’ అనే అంశంపై ప్రసంగిస్తూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉన్నప్పటికీ గత ఏడాది భారత్ బలమైన ఆర్థికాభివృద్ధిని సాధించగలిగిందని, ధరలను అదుపులో ఉంచుకోవడం, కరెంటు ఖాతా లోటును తగ్గించుకోవడం ద్వారా పురోగమన బాటలో పయనిస్తున్న భారత్ అంతర్జాతీయ పెట్టుబడిదారులకు సరికొత్త అవకాశాలను కల్పిస్తోందని జైట్లీ తెలిపారు. ప్రస్తుతం భారత్ సాధించిన 7.5 శాతం వృద్ధిరేటు చాలా తక్కువ అని, వాస్తవానికి మరింత వృద్ధిరేటును సాధించే సామర్ధ్యం భారత్‌కు ఉందని ఆయన పేర్కొన్నారు. భారత దేశ ఎగుమతులు క్షీణించడంపై జైట్లీ ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులే ఇందుకు కారణమని చెప్పారు. అయితే ప్రస్తుతం దేశ ఆర్థికాభివృద్ధి గాటన పడిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణల అజెండాను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోందని జైట్లీ తెలిపారు.
వ్యవసాయ జిడిపి గణనీయంగా
పెరుగుతుంది : ఎస్‌బిఐ అంచనా
ముంబయి: రుతుపవనాలు బాగా ఉంటాయన్న వాతావరణ శాఖ అంచనా గనుక నిజమైతే ఈ ఏడాది దేశ వ్యవసాయ జిడిపి కనీ వినీ ఎరుగని రీతిలో పెరుగుతుందని, 7-8 శాతానికి చేరుకోవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) ఒక నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణ స్థాయికి మించి ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసిన విషయం తెలిసిందే. వరసగా రెండు సంవత్సరాలు కరవుతో అల్లాడిన దేశ రైతాంగానికి ఇది ఎంతో ఊరట కల్గించే విషయమే. వాతావరణ శాఖ అంచనాలు, వ్యవసాయ రంగానికి ఊతమివ్వాలన్న ప్రభుత్వ ప్రణాళికల కారణంగా 2016-17 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ జిడిపి గణనీయంగా వృద్ధి చెందే అవకాశముందని, 7-8 శాతానికి సైతం చేరుకోవచ్చని ఎస్‌బిఐ రిసెర్చ్ రిపోర్ట్ పేర్కొంది. దీని ఫలితంగా బేస్‌లైన్ జిడిపి అరశాతం దాకా పెరిగే అవకాశముందని కూడా ఆ నివేదిక పేర్కొంది.