బిజినెస్

వడ్డీ రేటును 0.15 శాతం తగ్గించిన హెచ్‌డిఎఫ్‌సి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 19: దేశంలోని ప్రముఖ తనఖా రుణ సంస్థల్లో ఒకటైన హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ తమ రుణాలపై వడ్డీ రేటును 0.15 శాతం తగ్గించింది. ప్రస్తుతమున్న ఖాతాదారులకు వర్తించే ఈ వడ్డీ రేటు తగ్గింపు గురువారం నుంచే అమల్లోకి వస్తుందని హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. తగ్గించిన రుణ వడ్డీ రేటు ప్రవాస భారతీయులతో పాటు పిఐఓ కార్డులు కలిగి ఉన్నవారికి కూడా వర్తిస్తుందని ఆ సంస్థ పేర్కొంది. కొత్త ఖాతదారులకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటును ఈ సంస్థ ఈ నెల ఆరంభంలోనే తగ్గించిన విషయం తెలిసిందే. రూ.75 లక్షల రూపాయల లోపు రుణాలపై వడ్డీ రేటును 8.7 శాతానికి, అంతకంటే ఎక్కువ రుణాలపై వడ్డీ రేటును 8.75 శాతానికి తగ్గించిన హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ తమ రుణ లబ్ధిదారుల్లో మహిళలకు వడ్డీ రేటులో 0.05 శాతం రాయితీ ఇస్తోంది.