బిజినెస్

పర్యాటక రంగానికి కల్పతరువు తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగం వేగంగా ముందుకు వెళుతోందని తెలంగాణ టూరిజం కార్యదర్శి బుర్రావెంకటేశం పేర్కొన్నారు. గుజరాత్‌లోని కచ్‌లో జరుగుతున్న జాతీయ టూరిజం సదస్సులో ఆదివారం ఆయన మాట్లాడుతూ, పర్యాటకాభివృద్ధికి అనేక అవకాశాలున్నప్పటికీ, ఇప్పటి వరకు పెద్దగా దృష్టి కేంద్రీకరించలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ టూరిజం శాఖ నేతృత్వంలో అనేక చర్యలు చేపడుతున్నామన్నారు. కేవలం తెలంగాణలోనే కాకుండా, హర్యానా, పుదుచ్ఛేరి, డామన్ డయ్యూ రాష్ట్రాల్లో క్రీడలు, సంస్కృతి, టూరిజం అభివృద్ధికై జాతీయ సదస్సులో సంయుక్త ప్రెజెంటేషన్‌ను గ్రూప్‌లీడర్‌గా వెంకటేశం చేశారు. ‘ఏక్ భారత్-శ్రేష్ట భారత్’ కార్యక్రమానికి గ్రూప్‌లోని రాష్ట్రాల నుండి ప్రతిపాదనలు అందించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రాచీన రాతియుగంనాటి చారిత్రక ఆధారాలు ఎన్నో లభ్యమయ్యాయని గుర్తు చేశారు. బౌద్దులు, జైనులకు సంబంధించిన కట్టడాలు, ఆలయాలు, హిందూదేవాలయాలు, రాజధాని హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో చారిత్రక కట్టడాలు ఉన్నాయని, వైల్డ్‌లైఫ్‌కు పెట్టిందిపేరని, జలపాతాలున్నాయని, ప్రకృతి రమణీయతకు కేంద్రాలు అనేకం ఉన్నాయన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండే కాకుండా, విదేశాల నుండి కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని తెలిపారు.
బతుకమ్మ పండగ, పేరణి నృత్యం తెలంగాణకే పరిమితమైనవని, తెలంగాణతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయని వెంకటేశం తెలిపారు. బతుకమ్మ పండగకు, పేరణి నృత్యానికి అంతర్జాతీయంగా గత రెండున్నర ఏళ్లలో గుర్తింపు వచ్చిందన్నారు. టూరిజం అభివృద్ధికి తెలంగాణ సర్కారు చేపట్టిన కార్యక్రమాలను కేంద్ర అధికారులు ఈ సందర్భంగా ప్రశంసించారు.