బిజినెస్

మాల్యా కష్టాలకు ఆయన వ్యాపారం తీరే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 16: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన విజయ్ మాల్యా కష్టాలకు ఆయన వ్యాపార విధానాలే కారణమన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను నడిపిన తీరును ప్రశ్నిస్తూ భారత విమానయాన రంగం బాగానే ఉందని, చాలా సంస్థలు లాభాలను అందుకుంటున్నాయని గుర్తుచేశారు. ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకర్లకు 9,000 కోట్ల రూపాయలకుపైగా రుణాలను ఎగవేసిన మాల్యా.. ఉద్దేశపూర్వక ఎగవేతదారు ముద్రను మోస్తున్నది తెలిసిందే. అంతేగాక ‘కింగ్ ఆఫ్ గుడ్‌టైమ్స్’గా పిలిపించుకున్న మాల్యా.. తీసుకున్న అప్పులను ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయాడన్న అపఖ్యాతినీ మూటగట్టుకున్నాడు. ఐడిబిఐ బ్యాంకుకు 900 కోట్ల రూపాయలకుపైగా రుణాల ఎగవేత కేసులో మనీలాండరింగ్ కోణంలో ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విచారణను మాల్యా ఎదుర్కొంటున్నది తెలిసిందే. మూడుసార్లు విచారణకు హాజరుకాని మాల్యా పాస్‌పోర్టును రద్దు చేయాలంటూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఇడి ఆశ్రయించడంతో నాలుగు వారాలపాటు మాల్యా డిప్లొమాటిక్ పాస్‌పోర్టును శుక్రవారం సస్పెండ్ చేశారు కూడా. ఈ క్రమంలో జైట్లీ ఇక్కడ స్పందిస్తూ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను మాల్యా నిర్వహించిన తీరే దీనంతటికీ కారణం అన్నారు. ఈ వ్యవహారం కోర్టుల్లో ఉన్న నేపథ్యంలో రుణాల వసూళ్లకు బ్యాంకులు తగిన చర్యలు తీసుకుంటాయని అన్నారు.
మాల్యాకు నాన్-బెయిలబుల్ వారెంట్‌పై
నిర్ణయం రేపటికి వాయిదా
ముంబయి: మరోవైపు విజయ్ మాల్యాకు నాన్-బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేయాలన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అభ్యర్థనపై మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టు శనివారం తీర్పును రిజర్వ్ చేసింది. తమ నిర్ణయాన్ని సోమవారానికి వాయిదా వేసింది. ఐడిబిఐ బ్యాంక్ నుంచి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పేరిట తీసుకున్న 950 కోట్ల రూపాయల రుణంలో 430 కోట్ల రూపాయలతో విదేశాల్లో మాల్యా ఆస్తులు కొన్నారన్న అభియోగాలున్నాయి. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ మూడుసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ లండన్‌లో ఉన్న మాల్యా వాటిని ఖాతరు చేయకపోవడంతో శుక్రవారం మాల్యాకు నాన్-బెయిలబుల్ వారెంట్ కోసం ఇడి ప్రయత్నించింది. దీంతో దీనిపై శనివారం విచారణ జరిపిన కోర్టు.. తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.