బిజినెస్

చేదెక్కనున్న చక్కెర?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 26: రేషన్ దుకాణాల ద్వారా రాయితీపై అమ్మేందుకు జరుపుతున్న చక్కెర కొనుగోళ్లపై రాష్ట్రాలకు ఇకమీదట కేంద్రం నుంచి సబ్సిడీ లభించకపోవచ్చు. ఇటువంటి కొనుగోళ్లపై ప్రస్తుతం కిలోకి 18 రూపాయల 50 పైసల చొప్పున రాష్ట్రాలకు ఇస్తున్న సబ్సిడీని ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న తదుపరి (2017-18) సార్వత్రిక బడ్జెట్‌లో రద్దు చేయాలని, తద్వారా దాదాపు 4,500 కోట్ల రూపాయలను పొదుపు చేసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్న (బిపిఎల్) కుటుంబాలను కొత్త ఆహార భద్రతా చట్టంలో ఏవిధంగా పరిగణనలోకి తీసుకోవాలన్న దానిపై స్పష్టత లేదని, కనుక చక్కెర కొనుగోళ్లపై సబ్సిడీ రూపంలో చెల్లిస్తున్న నిధులను రాష్ట్రాలు పక్కదారి పట్టించే అవకాశం ఉందని కేంద్రం అనుమానిస్తోందని, అందుకే ఈ సబ్సిడీని రద్దు చేయాలని అరుణ్ జైట్లీ గట్టి పట్టుదలతో ఉన్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అమలులో ఉన్న పథకం ప్రకారం బహిరంగ మార్కెట్ నుంచి టోకు ధరలకు చక్కెరను కొనుగోలు చేసి రేషన్ దుకాణాల ద్వారా దానిని కిలో 13 రూపాయల 50 పైసల చొప్పున సబ్సిడీ రేటుతో ప్రజలకు పంపిణీ చేస్తున్న రాష్ట్రాలు కేంద్రం నుంచి ప్రతి కిలోకు 18 రూపాయల 50 పైసల చొప్పున రాయితీని పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అమలులో ఉన్న చక్కెర సబ్సిడీ పథకాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎత్తివేయనున్నట్లు ఆర్థిక శాఖ నుంచి వెలువడుతున్న సంకేతాలు స్పష్టం చేస్తున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
అయితే ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేయకుండా అంత్యోదయ అన్న యోజన (ఎఎవై) ద్వారా కనీసం నిరుపేద కుటుంబాలకైనా కొనసాగించాలని కోరుతూ కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఆర్థిక మంత్రికి ప్రతిపాదించారు. ఈ విషయమై ఆహార మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు కూడా లేఖలు రాసింది. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి చక్కెరపై రాయితీని ఉపసంహరించుకున్నట్లయితే రేషన్ షాపుల ద్వారా జరిపే చక్కెర అమ్మకాలకు అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్రాలే భరించాలని పాశ్వాన్ ఆ లేఖల్లో స్పష్టం చేశారు.