బిజినెస్

నగదు కష్టాలు తీరినట్టే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 26: పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు కొరత వలన దేశంలో తలెత్తిన సమస్యలు క్రమేణా తగ్గుముఖం పట్టడంతో బ్యాంకులు, ఎటిఎంల నుంచి నగదు ఉపసంహరణపై విధించిన పరిమితులను రిజర్వు బ్యాంకు వచ్చే నెలలో తొలగించే అవకాశం ఉందని బ్యాంకర్లు చెబుతున్నారు. ఎటిఎం నుంచి ఇంతకుముందు రోజుకు 4,500 రూపాయలుగా ఉన్న నగదు ఉపసంహరణ పరిమితిని రిజర్వు బ్యాంకు ఇటీవల 10 వేల రూపాయలకు పెంచినప్పటికీ బ్యాంకుల్లోని పొదుపు ఖాతాల నుంచి జరిపే నగదు ఉపసంహరణ పరిమితిని వారానికి 24 వేల రూపాయలుగానూ, కరెంట్ అకౌంట్ల నుంచి జరిపే నగదు ఉపసంహరణ పరిమితిమి వారానికి లక్ష రూపాయలుగానూ కొనసాగించిన విషయం విదితమే. అయితే ప్రస్తుతం నగదు కొరత చాలా మేరకు తగ్గినందున రిజర్వు బ్యాంకు ఫిబ్రవరి నెలాఖరు నాటికి లేదా మార్చి నెల మధ్య నాటికి నగదు ఉపసంహరణలపై పరిమితులను పూర్తిగా తొలగిస్తుందని భావిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ ఆర్‌కె.గుప్తా పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. నగదు ఉపసంహరణలపై పరిమితులను పూర్తిగా తొలగించాలా? లేదా? అన్నదానిపై నిర్ణయం పూర్తిగా రిజర్వు బ్యాంకు చేతుల్లోనే ఉందని, కనుక పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దీనిపై ఆర్‌బిఐ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాని ఆయన చెప్పారు.
ఇదిలావుంటే, 78 నుంచి 88 శాతం నగదు అందుబాటులోకి రావడంతో పాటు చిన్న నోట్ల పంపిణీ బాగా పెరుగుతుందని, కనుక రానున్న రెండు నెలల్లో పరిస్థితులన్నీ మళ్లీ సాధారణ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) అధ్యయన నివేదిక ‘ఎకోవ్రాప్’ స్పష్టం చేయగా, సమస్యలు తగ్గుతున్నాయని, కనుక కొద్ది వారాల వ్యవధిలోనే నగదు ఉపసంహరణపై పరిమితులన్నింటినీ రిజర్వు బ్యాంకు పూర్తిగా ఎత్తివేసే అవకాశం ఉందని మరో ప్రభుత్వ రంగ బ్యాంకుకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఆ వివరాలు వెల్లడించలేం : బిఆర్‌బిఎన్‌ఎల్
కాగా, గత ఏడాది నవంబర్ 8వ తేదీన పాత 500, 1000 రూపాయల నోట్ల చలామణి రద్దు నిర్ణయాన్ని ప్రకటించడానికి ముందు ప్రభుత్వం ఎంత పరిమాణంలో కొత్త 2000, 500 రూపాయల నోట్లను ముద్రించిందో వెల్లడించాలని సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు రిజర్వు బ్యాంకు అనుబంధ విభాగమైన బిఆర్‌బిఎన్‌ఎల్ (్భరతీయ రిజర్వు బ్యాంక్ నోట్ (ప్రైవేట్) లిమిటెడ్) నిరాకరించింది. ఈ వివరాలను వెల్లడించడం వలన ప్రభుత్వ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని, కనుక ఈ ప్రశ్నకు సమాధానమివ్వలేమని బిఆర్‌బిఎన్‌ఎల్ స్పష్టం చేసింది.