బిజినెస్

టిసిఎస్‌కు అమెరికా కోర్టు భారీ జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 16: భారత ఐటిరంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్), దాని అమెరికా విభాగమైన టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్ప్‌పై అమెరికా కోర్టు భారీ జరిమానా విధించింది. అనుమతి లేకుండా ఎపిక్ సిస్టమ్స్ సాఫ్ట్‌వేర్‌ను తీసుకున్నందుకుగాను ఎపిక్ సిస్టమ్స్‌కు నష్టపరిహారంగా 240 మిలియన్ డాలర్లను చెల్లించాలని టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్ప్‌ను విస్కాన్సిన్‌లోని ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ ఆదేశించింది. అంతేగాక శిక్షగా మరో 700 మిలియన్ డాలర్లను చెల్లించాలని టిసిఎస్‌ను ఆదేశించింది. దీంతో మొత్తం 940 మిలియన్ డాలర్లను ఎపిక్ సిస్టమ్స్‌కు టాటా గ్రూప్ ఇవాల్సిందిగా కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు దీన్ని టిసిఎస్ ఖండించింది. దీనిపై న్యాయపోరాటం చేస్తామంది.