బిజినెస్

ఆరంభం అదిరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఇ).. ఈక్విటీ మార్కెట్ ప్రవేశం అదిరింది. ఆసియా ఖండంలోనే ప్రాచీనమైన, 140 ఏళ్ల చరిత్ర కలిగిన బిఎస్‌ఇని.. శుక్రవారం నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ)లో లిస్టింగ్ చేశారు. దీంతో ఈ ఒక్కరోజే సంస్థ షేర్ విలువ 33 శాతం మేర పెరిగింది. 806 రూపాయల వద్ద ఎన్‌ఎస్‌ఇలో బిఎస్‌ఇ షేర్ లిస్టవగా, మదుపరుల భారీ కొనుగోళ్లతో 1,069.20 రూపాయల వద్దకు ఎగబాకింది. దీంతో 32.65 శాతం పెరుగుదల నమోదైంది. ఒకానొక సమయంలోనైతే ఏకంగా 48.88 శాతం వృద్ధితో 1,200 రూపాయల స్థాయిని అందుకోవడం గమనార్హం. నిజానికి ట్రేడింగ్ ఆరంభం నుంచే మదుపరులను బిఎస్‌ఇ షేర్లు ఆకట్టుకున్నాయి. దీంతో మొదలే 34.61 శాతం వృద్ధితో 1,085 రూపాయలకు చేరింది షేర్ విలువ. సమయం గడుస్తున్నకొద్దీ విలువ పెరగగా, మార్కెట్ ముగింపు సమయం దగ్గరపడుతున్నకొద్దీ విలువ కాస్త పడిపోయింది. అయినప్పటికీ రికార్డు స్థాయిలోనే పెరుగుదలను అందుకోవడం విశేషం. అంతకుముందు ఎన్‌ఎస్‌ఇ చైర్మన్ అశోక్ చావ్లా, బిఎస్‌ఇ చైర్మన్ సుధాకర్ రావు కలిసి ఎన్‌ఎస్‌ఇలో బిఎస్‌ఇ షేర్ల ట్రేడింగ్‌కు బెల్ మోగించారు. అనంతరం మదుపరుల స్పందనపట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు.
ఎన్‌ఎస్‌ఇ కొత్త సారథి
విక్రమ్ లిమయే
ఎన్‌ఎస్‌ఇ నూతన సిఇఒ, ఎండిగా ఐడిఎఫ్‌సి చీఫ్ విక్రమ్ లిమయే ఎన్నికయ్యారు. రెండు నెలల క్రితం అనూహ్యంగా చిత్రా రామకృష్ణ ఈ పదవులకు రాజీనామా చేయడంతో ఆమె స్థానంలో శుక్రవారం లిమయేను ఎంపిక చేసింది ఎన్‌ఎస్‌ఇ. 2013 ఏప్రిల్‌లో ఎన్‌ఎస్‌ఇ సిఇఒ, ఎండిగా చిత్రా రామకృష్ణ బాధ్యతలు చేపట్టారు. 2018 మార్చి వరకు ఆమె పదవీకాలం ఉన్నప్పటికీ పలు అభిప్రాయ బేధాల కారణంగా తప్పుకున్నారు.
వరుస లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లలో బడ్జెట్ ర్యాలీ వరుసగా మూడోరోజూ కొనసాగింది. అయితే శుక్రవారం సూచీలు స్వల్ప లాభాలకే పరిమితమవగా, ఈ వారం మొత్తంగా చూసినట్లైతే చెప్పుకోదగ్గ లాభాలనే అందుకున్నాయి. శుక్రవారం బిఎస్‌ఇ సూచీ సెనె్సక్స్ 13.91 పాయింట్లు పెరిగి 28,240.52 వద్ద, ఎన్‌ఎస్‌ఇ సూచీ నిఫ్టీ 6.70 పాయింట్లు అందుకుని 8,740.95 వద్ద స్థిరపడగా, ఈ వారం మొత్తంగా సెనె్సక్స్ 358.06, నిఫ్టీ 99.70 పాయింట్లు పుంజుకున్నాయి. అంతకుముందు రెండు వారాల్లోనూ సూచీలు లాభపడినది తెలిసిందే. ఇక హెల్త్‌కేర్, పిఎస్‌యు, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఐటి, బ్యాంకింగ్ షేర్లు లాభపడ్డాయి. మరోవైపు ఆసియా మార్కెట్లలో జపాన్ సూచీ లాభాల్లో, హాంకాంగ్, చైనా సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లలోనూ ప్రధాన సూచీలు లాభాల్లో కదలాడాయి.

చిత్రం..ఎన్‌ఎస్‌ఇలో బిఎస్‌ఇ షేర్ల లిస్టింగ్‌ను శుక్రవారం ముంబయలో
బెల్ మోగించి ప్రారంభిస్తున్న బిఎస్‌ఇ చైర్మన్ సుధాకర్ రావు. చిత్రంలో ఎన్‌ఎస్‌ఇ చైర్మన్ అశోక్ చావ్లా కూడా ఉన్నారు