బిజినెస్

శ్రీసిటీని సందర్శించిన కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ, ఫిబ్రవరి 4: నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దులో అంతర్జాతీయ ప్రమాణాలతో వెలసిన శ్రీసిటీ పారిశ్రామిక వాడను శనివారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రీటా టియోటియా సందర్శించారు. శ్రీసిటీ ఎండి రవీంద్ర సన్నారెడ్డి, సెజ్ అసిస్టెంట్ డెవలప్‌మెంట్ కమిషనర్ శర్మలతో కలసి ఆమె సెజ్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి వౌలిక వసతులు, పారిశ్రామిక ప్రగతిని వీక్షించారు. ఫాక్స్‌కాన్, ఆల్‌స్ట్రామ్, జెన్ లెనిన్ పరిశ్రమల్లోకి వెళ్లి అక్కడ ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం బిజినెస్ సెంటర్‌లో జరిగిన పారిశ్రామిక ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు. పరిశ్రమలు వాణిజ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పన్నులు, పారిశ్రామిక విధానంపై పలువురు ప్రతినిధులు అడిగిన సందేహాలను ఆమె నివృత్తి చేశారు. త్వరలో అమలుకానున్న జీఎస్టీ విధానం ద్వారా అన్ని పన్నుల సమస్యలు తొలిగిపోతాయంటూ వారికి భరోసా ఇచ్చారు. శ్రీసిటీ మరింత వేగంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కేంద్ర వాణిజ్య కార్యదర్శి పర్యటన.. పరిశ్రమల వారితో పరస్పర చర్చలు జరగడమే కాకుండా తమకు ఎంతో ఉపయోగపడుతుందని శ్రీసిటీ ఎండి తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, లెదర్ ఎక్స్‌పోర్ట్స్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్‌కుమార్, చెన్నై సెజ్ డెవలప్‌మెంట్ కమిషనర్ ఎంకె షణ్ముగసుందరం, ఫారిన్ ట్రేడ్ జాయింట్ డైరెక్టర్ జనరల్ ఎఫ్‌డి ఇనిత, జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు, చిత్తూరు సబ్ కలెక్టర్ నిషాంత్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..శ్రీసిటీలో పరిశ్రమలను సందర్శిస్తున్న కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రీటా టియోటియా