బిజినెస్

ఎస్‌బిఐలో 970 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేసిన టిటిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 25: శ్రీవారికి చెందిన 970.080 కిలోల బంగారాన్ని ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐలో గోల్డ్‌మానిటైజేషన్ పథకం కింద శనివారం డిపాజిట్ చేశారు. టిటిడి ఈఓ డాక్టర్ డి సాంబశివరావు తన చాంబర్‌లో ఎస్‌బిఐ ఎండి రజనీ కుమార్‌కు ఇందుకు సంబంధించిన అంగీకార పత్రాలను అందజేశారు. వాస్తవానికి ఈ బంగారాన్ని ఎస్‌బిఐలో 2016 మార్చి మాసంలో టిటిడి డిపాజిట్ చేసింది. అయతే కాల పరిమితి పూర్తికావడంతో వడ్డీ రూపంలో వచ్చిన బంగారంతోసహా మొత్తం బంగారాన్ని తిరిగి డిపాజిట్ చేసింది. ఈసారి మూడేళ్ల కాలానికి స్వల్పకాలిక వడ్డీతో ఈ బంగారాన్ని డిపాజిట్ చేసుకోవడానికి ఎస్‌బిఐ ముందుకు వచ్చింది.
కాగా, ఇప్పటికే శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు కానుకల రూపంలో అందించిన మిక్స్‌డ్ కేటగిరి బంగారు నగలు, వస్తువులు కలసి దాదాపు 1,400 కిలోలను ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 1.2 శాతం వడ్డీకి టిటిడి డిపాజిట్ చేసిన విషయం తెలిసిందే. దీనిని మూడు సంవత్సరాల కాల పరిమితితో గోల్డ్‌మానిటైజేషన్ పథకంలో భాగంగా డిపాజిట్ చేశారు. మరో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లోనూ 1,311 కిలోల 0.995 స్వచ్ఛత కలిగిన బంగారు కడ్డీలను 1.75 శాతం వడ్డీతో టిటిడి డిపాజిట్ చేసింది. ఈ స్వచ్ఛత కేటగిరిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెల్లిస్తున్న అత్యధిక వడ్డీ ఇదే కావడం గమనార్హం. ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవాలయంగా టిటిడి వెలుగొందుతోంది. నిత్యం స్వామివారిని దర్శించుకునేం దుకు వచ్చే వేలాది భక్తులు.. కోట్ల రూపాయల విలువైన కానుకలను సమర్పి స్తారు. అలా నగదు, బంగారం రూపంలో వచ్చిన కానుకలన్నింటినీ బ్యాంకుల్లో టిటిడి డిపాజిట్ చేస్తోంది. దానిపై భారీగా వడ్డీని కూడా పొందుతోంది.

చిత్రం..బంగారాన్ని డిపాజిట్ చేస్తూ ఎస్‌బిఐ ఎండితో ఒప్పందం కుదుర్చుకుంటున్న టిటిడి ఈఓ సాంబశివరావు