బిజినెస్

ట్రంప్ భయాలతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 27: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. మార్చి డేరివేటివ్ సిరీస్ తొలిరోజే సూచీలు నిరాశపరచగా, ఈ వారం కాంగ్రెస్ ఎదుట అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించనున్న క్రమంలో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 80.09 పాయింట్లు పడిపోయి 28,812.88 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 42.80 పాయింట్లు దిగజారి 8,896.70 వద్ద నిలిచింది. యాక్సిస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్‌టెల్, ఐసిఐసిఐ బ్యాంక్, మారుతి సుజుకి, ఎల్‌అండ్‌టి, డాక్టర్ రెడ్డీస్, టాటా మోటార్స్ షేర్లు 3.56 శాతం నుంచి 1.02 శాతం మేర నష్టపోగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హెచ్‌యుఎల్, విప్రో, లుపిన్, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, టిసిఎస్ షేర్లు లాభపడ్డాయి. ఆసియా, ఐరోపా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.