బిజినెస్

పడకేసిన పారిశ్రామికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ఎనిమిది కీలక రంగాల (ఐఐపి) పనితీరు ఈ ఏడాది జనవరిలో ఐదు నెలల కనిష్టానికి మందగించింది. రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, సిమెంట్ రంగాల్లో చోటుచేసుకున్న మందగమనంతో 3.4 శాతానికి పరిమితమైంది. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ రంగాలతో కూడిన ఈ ఎనిమిది కీలక రంగాల పనితీరు నిరుడు జనవరిలో 5.7 శాతంగా ఉంది. కాగా, నిరుడు ఆగస్టులో ఈ కీలక రంగాల పనితీరు 3.2 శాతంగా నమోదవగా, మళ్లీ ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలోనే ఆ దరిదాపు స్థాయిల్లో నమోదైంది. నిరుడు డిసెంబర్‌లోనూ ఇది 5.6 శాతంగా ఉండటం గమనార్హం. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం నిరుడు ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య ఎనిమిది కీలక రంగాల పనితీరు 4.8 శాతంగా ఉంది. అంతకుముందు ఇది 2.9 శాతానికే పరిమితమైంది.