బిజినెస్

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 2: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో బుధవారం నాటి లాభాలను కొనసాగించడంలో సూచీలు విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 144.70 పాయింట్లు కోల్పోయి 28,839.79 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 46.05 పాయింట్లు పడిపోయి 8,899.75 వద్ద నిలిచింది. నిజానికి ఒకానొక దశలో సెనె్సక్స్ 29,145.62, నిఫ్టీ 8,992.50 పాయింట్ల గరిష్ఠ స్థాయిని చేరుకున్నాయి. మరో దశలో సెనె్సక్స్ 28,784.31, నిఫ్టీ 8,879.80 పాయింట్ల కనిష్ట స్థాయినీ తాకాయి. అయితే తీవ్ర ఒడిదుడుకుల మధ్య చివరకు సూచీలు నష్టాలకే పరిమితమయ్యాయి. రియల్టీ, పవర్, పిఎస్‌యు, హెల్త్‌కేర్, చమురు, గ్యాస్, ఎఫ్‌ఎమ్‌సిజి, బ్యాంకింగ్ రంగాల షేర్ల విలువలు 4.34 శాతం మేర క్షీణించాయి. అంతర్జాతీయంగా చూస్తే ఆసియా మార్కెట్లలో చైనా సూచీ నష్టపోగా, హాంకాంగ్, జపాన్ సూచీలు లాభపడ్డాయి. ఐరోపా మార్కెట్లు నష్టాల్లో కదలాడాయి.