బిజినెస్

స్వల్పంగా పెరిగిన బజాజ్ అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 2: దేశీయ ద్విచక్ర, త్రిచక్ర వాహన తయారీదారు బజాజ్ ఆటో అమ్మకాలు గత నెల ఫిబ్రవరిలో స్వల్పంగా పెరిగాయి. 2,73,513 యూనిట్లుగా నమోదయ్యాయి. నిరుడు ఫిబ్రవరిలో 2,72,719 యూనిట్లుగా ఉన్నాయి. వీటిలో దేశీయ విక్రయాలు ఈ ఫిబ్రవరిలో 1,59,109 యూనిట్లుగా, పోయినసారి 1,73,760 యూనిట్లుగా ఉన్నాయి. ఈ మేరకు గురువారం బజాజ్ ఆటో తెలియజేసింది. కాగా, మొత్తం అమ్మకాల్లో మోటార్ సైకిల్ అమ్మకాలు గతంతో చూస్తే 4.11 శాతం పెరిగి 2,35,282 యూనిట్ల నుంచి 2,44,958 యూనిట్లకు చేరాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు మాత్రం 37,437 యూనిట్ల నుంచి 28,555 యూనిట్లకు పడిపోయాయి.
యమహా మోటార్
దేశీయ ద్విచక్ర వాహన తయారీదారు యమహా మోటార్ విక్రయాలు ఈ ఫిబ్రవరిలో గతంతో పోల్చితే 20 శాతం పెరిగి 68,095 యూనిట్లుగా నమోదయ్యాయి. నిరుడు ఫిబ్రవరిలో 56,960 యూనిట్లుగా ఉన్నాయని గురువారం ఓ ప్రకటనలో యమహా మోటార్ ఇండియా సేల్స్ ఉపాధ్యక్షుడు (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాయ్ కురియన్ చెప్పారు. ఈ ఏడాది పది లక్షల యూనిట్ల అమ్మకాలు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
విఇ కమర్షియల్
విఇ కమర్షియల్ వాహనాల అమ్మకాలు ఫిబ్రవరిలో 5,499 యూనిట్లుగా నమోదయ్యాయి. నిరుడు ఫిబ్రవరిలో 5,032 యూనిట్లుగా ఉండగా, ఈసారి 9.3 శాతం పెరిగాయి. స్వీడన్‌కు చెందిన వొల్వో గ్రూప్, భారత్‌కు చెందిన ఐషర్ మోటార్ జాయింట్ వెంచరే విఇ కమర్షియల్. కాగా, దేశీయ మార్కెట్‌లో 4,828 యూనిట్ల విక్రయాలు జరిగాయని, నిరుడు 4,264 యూనిట్ల అమ్మకాలు అయ్యాయని గురువారం ఓ ప్రకటనలో సంస్థ తెలియజేసింది.
ఫోక్స్‌వాగన్
జర్మనీకి చెందిన ఆటో దిగ్గజం ఫోక్స్‌వాగన్ భారతీయ అమ్మకాలు గత నెల ఫిబ్రవరిలో 58 శాతం పెరిగి 3,965 యూనిట్లుగా నమోదయ్యాయి. నిరుడు ఫిబ్రవరిలో ఇవి 2,510 యూనిట్లుగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన అమియో మోడల్ మార్కెట్‌లో కస్టమర్లను ఆకట్టుకుందని ఓ ప్రకటనలో గురువారం సంస్థ ప్యాసింజర్ కార్స్ విభాగం డైరెక్టర్ మిచెల్ మేయర్ తెలియజేశారు.