బిజినెస్

కాగ్నిజెంట్ చేతికి బ్రిలియంట్ సర్వీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 2: జపాన్‌కు చెందిన బ్రిలియంట్ సర్వీస్ కో సంస్థను తాము కొనుగోలు చేసినట్లు ఐటి సేవల సంస్థ కాగ్నిజెంట్ గురువారం తెలియజేసింది. అయితే ఎంతకు కొనుగోలు చేసిందనే వివరాలు మాత్రం తెలియరాలేదు. కాగా, ఈ కొనుగోలులో భాగంగా 70 మంది నిపుణులతోకూడిన బృందం కాగ్నిజెంట్‌లోకి వస్తోంది. జపాన్ మార్కెట్‌లో వీరికి ఉన్న అనుభవం తమకు తోడ్పడగలదని ఓ ప్రకటనలో కాగ్నిజెంట్ ఆశాభావం వ్యక్తం చేసింది. డిజిటల్ స్ట్రాటజీలో పరిష్కార మార్గాలను బ్రిలియంట్ అందిస్తుంది. ఒసకాలో ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. 2004లో దీన్ని స్థాపించారు.