బిజినెస్

క్రాంప్టన్ గ్రీవ్స్ పేరు మారింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 2: అవంతా గ్రూప్‌నకు చెందిన క్రాంప్టన్ గ్రీవ్స్.. తమ పేరును సిజి పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లిమిటెడ్‌గా మార్చినట్లు గురువారం తెలిపింది. గత నెల ఫిబ్రవరి 27 నుంచే కొత్త పేరు అమల్లోకి వస్తుందని ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ సంస్థ ప్రస్తుతం పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్ బి2బి పవర్ ట్రాన్స్‌మిషన్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ ప్రొవైడర్‌గా సేవలందిస్తోంది. అలాగే వివిధ ఎలక్ట్రిక్ ఉత్పత్తులనూ తయారుచేసి మార్కెట్‌లో విక్రయిస్తోంది. అయితే ప్రస్తుత సిజి లోగోనే ఇకపైనా దేశ, విదేశీ మార్కెట్లలో కొనసాగుతుందని చెప్పింది.