బిజినెస్

సివి ఆనంద్‌కు ఇన్నొవేటివ్ లీడర్‌షిప్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ సివి ఆనంద్‌కు రాజస్థాన్ ప్రభుత్వం ‘ఇన్నొవేటివ్ లీడర్‌షిప్’ అవార్డు అందించింది. కేంద్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ సహాయ మంత్రి పిపి చౌదరి ఈ అవార్డును ఆనంద్‌కు శుక్రవారం అందించారు. జైపూర్‌లో రాజస్థాన్ ప్రభుత్వం మూడు రోజుల పాటు ‘ఇ-ఇండియా ఇన్నొవేటివ్ సమ్మిట్’ను నిర్వహిస్తోంది. ఇది శుక్రవారం ప్రారంభమైంది. దీంతో ప్రభుత్వ విధి నిర్వహణలో అత్యాధునిక సాంకేతిక విజ్ఞానాన్ని పూర్తిగా వినియోగిస్తూ, అక్రమాలకు తెరదించిన ఆనంద్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఆనంద్ గతంలో హైదరాబాద్ పోలీస్ శాఖలో పనిచేసిన సమయంలో పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను మూడు రోజుల్లో ముగిసేలా చర్యలు తీసుకోవడం, మద్యం తాగి వాహనాలను నడిపేవారిపై కఠినంగా స్పందించడం, ట్రాఫిక్ నియమావళిని ఉల్లంఘించిన కేసుల్లో ఇ-చలాన్లు ప్రవేశపెట్టడం, పోలీస్ స్టేషన్లలో సిసిటివిలు ఏర్పాటు చేయడం, వీడియో కాన్ఫరింగ్ విధానాన్ని అమ లు చేయడం వల్ల సత్ఫలితాలు లభించాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో 2014లో సాధారణ ఎన్నికలు వచ్చా యి. ఆ ఎన్నికల్లో ఎన్నికల కోసం వాడిన వాహనాలకు జిపిఎస్ ఉపయోగించి ఎన్నికల అక్రమాలను అరికట్టడంతో ఆనంద్‌కు రాష్టప్రతి అవార్డు కూడా లభించింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలను ఏర్పాటు చేయడం, గోదాముల్లో సిసి కెమెరాలను ఉపయోగించడంతోపాటు కొత్త యాప్‌లను ప్రవేశపెట్టిన ఘనతను ఆనంద్ దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆనంద్ ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆయన చేపట్టిన కార్యక్రమాలు అందరికీ తెలిశాయి. ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు వేగంగా కొనసాగేందుకు, అవినీతి, అక్రమాలను నిర్మూలించేందుకు ఆనంద్ చేపట్టిన చర్యలు ఉపయోగపడ్డాయని అందరూ అభినందించారు.

చిత్రం..కేంద్ర మంత్రి పిపి చౌదరి నుండి అవార్డు తీసుకుంటున్న ఆనంద్