బిజినెస్

స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 3: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈ వారం మొత్తంగా బుధవారం ఒక్కరోజే సూచీలు లాభాలను అందుకోగా, గడచిన ఆరు వారాల్లో తొలిసారిగా ఈ వారం స్టాక్ మార్కెట్లు నష్టాలకే పరిమితమయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఈ నెలాఖర్లో ద్రవ్యసమీక్ష నిర్వహించనుండగా, కీలక వడ్డీరేట్లను పెంచుతుందన్న అంచనాలు మదుపరుల కొనుగోళ్ల శక్తిని దెబ్బతీశాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ శుక్రవారం ట్రేడింగ్‌లో 7.34 పాయింట్లు పడిపోయి 28,832.45 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 2.20 పాయింట్లు కోల్పోయి 8,897.55 వద్ద నిలిచింది. ఇకపోతే ఈ వారం మొత్తంగా సెనె్సక్స్ 60.52 పాయింట్లు, నిఫ్టీ 41.95 పాయింట్లు క్షీణించాయి. ఎఫ్‌ఎమ్‌సిజి, బ్యాంకింగ్, ఆటో, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవగా, చమురు, గ్యాస్, రియల్టీ రంగాల షేర్ల విలువ పెరిగింది.