బిజినెస్

పెద్ద నోట్ల రద్దుతో అవినీతికి కళ్ళెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: పాత పెద్ద నోట్ల రద్దు ద్వారా ప్రజలు చాలా కష్టాలు ఎదుర్కొన్నారన్న ప్రచారం శుద్ధ అబద్దమని, పెద్ద నోట్ల రద్దు ద్వారా అవినీతికి, ఉగ్రవాదానికి కళ్లెం వేసి సమ్మిళిత ఆర్థిక అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ నాంది పలికారని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఇది జన ఆవేదన కాదని, కాంగ్రెస్ ఆవేదన మాత్రమేనని మండిపడ్డారు. పేద, దళిత, బడుగు, బలహీన వర్గాలకు ఆర్థిక సాధికారత కలిగించారని పేర్కొ న్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పారని, ఇది హాస్యాస్పదమని అన్నారు. దేశం మాట దేవుడెరుగు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఘోర పరాజయం పాలవుతోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం సోనియా, రాహుల్ గాంధీలు లేకుంటే వచ్చేదా? అని ప్రశ్నించడం ఉత్తరకుమార ప్రగల్భాలేనన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై ఆలోచించడానికి 60 సంవత్సరాలు పట్టిందని, 60 సంవత్సరాల ప్రజా పోరాటాల ద్వారా మాత్రమే తెలంగాణ ఏర్పడిందని, ఎవరి దయాదాక్షిణ్యాలతో తెలంగాణ రాలేదన్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అభివృద్ధి, సుపరిపాలన అందిస్తూ 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ చేసిన తప్పుడు విధానాలను ప్రక్షాళన చేస్తూ అందరి మన్ననలు పొందుతూ విజయపరంపరలో ముందుకు సాగుతోందని చెప్పారు.
ప్రజల వద్దకు మంత్రి
ప్రజా సమస్యలు వినేందుకు మంత్రి బండారు దత్తాత్రేయ శనివారం నాడు హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లోని జగదాంబనగర్‌కు, మెహిదీపట్నంలోని మండులగూడలోనూ పర్యటిస్తారని, ఈ సందర్భంగా ఆయన ప్రజా సమస్యలను విని, వాటి పరిష్కారానికి చర్యలు చేపడతారని మంత్రి కార్యాలయం పేర్కొంది.