బిజినెస్

పారిశ్రామిక భూములను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 6: పరిశ్రమలకు కేటాయించిన భూములను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్థ (టిఎస్‌ఐఐసి) చైర్మన్ గ్యాదరి బాలమల్లు హెచ్చరించారు. సోమవారం తన చాంబర్‌లో జోనల్ మేనేజర్లు, ఐలా కమిషనర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న పాత ఇండస్ట్రియల్ పార్కులను ఎంఎస్‌ఈ-క్లస్టర్ డెవలెప్‌మెంట్ ప్రోగ్రామ్ (సిడిపి) ద్వారా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పథకం క్రింద ప్రతి పారిశ్రామిక పార్కును 10 కోట్ల రూపాయల తో అభివృద్ధి చేసి వౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందుంచేందుకుగాను టిఎస్-ఐపాస్‌ను ముఖ్యమంత్రి కెసిఆర్ అమల్లోకి తెచ్చారని చెప్పారు. పారిశ్రామిక పార్కులు, ఎస్టేట్‌లను అప్‌గ్రేడ్ చేసే కార్యక్రమంలో భాగంగా సంబంధిత అధికారులు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. అనంతరం ఆ నివేదికలను కేంద్రానికి పంపిస్తామని తెలిపారు. అమలు జరుగుతున్న ప్రాజెక్టుల్లో పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టేందుకు కూడా వెనుకాడవద్దని అధికారులకు స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు పనులను సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. వివిధ కారణాలతో మూతబడిన పరిశ్రమలను తెరిపించేందుకు కృషి చేయాలని, స్పందించని వారికి నోటీసులు జారీ చేయాలని టిఎస్‌ఐసిసి చైర్మన్ స్పష్టం చేశారు. అప్పటికీ స్పందించకపోతే వారికి కేటాయించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు.