బిజినెస్

ద్రవ్యోల్బణాన్ని అదుపు చేశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దహేజ్ (గుజరాత్), మార్చి 7: దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని, పాత పెద్ద నోట్ల రద్దు వల్ల జిడిపికి వచ్చిన ముప్పేమి లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2014కు ముందు ద్రవ్యోల్బణం అదుపులో లేదన్న ఆయన తాము అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయని, ఒక్క రాష్ట్రంలో కూడా ప్రతిపక్షాలు ద్రవ్యోల్బణం అంశాన్ని లేవనెత్తలేకపోయాయని గుర్తుచేశారు.
మంగళవారం ఇక్కడ ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు ఉత్పత్తి, అనే్వషణ దిగ్గజం ఒఎన్‌జిసి పెట్రో ఆడిషన్స్ లిమిటెడ్ (ఒపిఎఎల్) కాంప్లెక్స్ వద్ద నిర్వహించిన ఓ పారిశ్రామిక సమ్మేళనంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత పెద్ద నోట్ల రద్దు అంశాన్ని గోరంత కొండంత చేసి చూపించారని, దేశ జిడిపి వృద్ధిరేటును నోట్ల రద్దు దెబ్బతీసిందని ప్రచారం చేశారని మండిపడ్డారు. అయినప్పటికీ అదేమీ లేదని ఇటీవలి గణాంకాల్లో తేలిందని చెప్పుకొచ్చారు. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో జిడిపి వృద్ధిరేటు 7 శాతంపైనే నమోదైందని గుర్తుచేశారు.
వైద్యవిద్యను చక్కబెట్టడానికే 4 వేల పీజీ సీట్లు
సూరత్: వైద్య విద్యా రంగాన్ని సరైన మార్గంలోకి తీసుకురావటానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందని, అందులో భాగంగానే దేశవ్యాప్తంగా నాలుగు వేల పిజి సీట్లను సృష్టించిందని నరేంద్ర మోదీ తెలిపారు. ‘‘వైద్య రంగానికి సంబంధించి మన దేశంలో ఎప్పుడూ ఎదురయ్యే సమస్య వైద్యులు లేరన్నది. ఎందుకంటే మన దగ్గర వైద్యులను తయారు చేసేందుకు సరైన వ్యవస్థ లేకపోవటమే’’ అని మోదీ అన్నారు. మంగళవారం గుజరాత్ పర్యటనలో భాగంగా సూరత్ విమానాశ్రయంలో ఆగిన ఆయన అక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘‘మనం సమస్య మూలాల్లోకి వెళ్లినప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చాలా తక్కువ మంది విద్యార్థులకు ప్రవేశం లభిస్తోందని తేలిపోయింది. కేవలం సీట్ల సంఖ్య తక్కువగా ఉండటం వల్లనే ఇది జరుగుతోంది. దీనివల్ల ప్రొఫెసర్ల సంఖ్యా పరిమితంగానే ఉంటోంది. ప్రొఫెసర్ల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల కొత్తగా వైద్య కళాశాలలు ప్రారంభించటం సాధ్యం కావటం లేదు. ఇది మొత్తం వైద్య విద్యావ్యవస్థపై ప్రభావం చూపుతోంది. అందువల్లే ఈ ఏడాది 4,000 పీజీ సీట్లు ఇవ్వటం అతిపెద్ద ముందడుగు. దీనివల్ల ఇప్పుడున్న సీట్లకు అదనంగా ఏటా నాలుగు వేల మంది పిజి విద్యార్థులు పాసవుట్ అవుతారు. వీరిలో చాలామంది ప్రొఫెసర్లు కావటానికి వీలుంది. తద్వారా దేశంలో వైద్యుల కొరతను తగ్గించేందుకు మార్గం ఏర్పడుతుంది’’ అని ఆయన అన్నారు. ఈ చర్య కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరచగలమన్న విశ్వాసం ఏర్పడిందని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. కాగా, గుజరాత్‌లో 500 పట్టణాలు బహిరంగ మల విసర్జన రహితంగా మార్చినందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని మోదీ అన్నారు.

చిత్రం..మంగళవారం గుజరాత్‌లోని దహేజ్‌లోగల ఒపిఎఎల్ వద్ద జరిగిన పారిశ్రామిక సమ్మేళనంలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ