బిజినెస్

జెఎల్‌ఆర్ అమ్మకాల్లో 9 శాతం వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 7: దేశీయ ఆటోరంగ దిగ్గజం టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ బ్రాండ్ జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) గత నెల అమ్మకాలు 9.3 శాతం పెరిగాయి. ఈ ఫిబ్రవరిలో 40,978 యూనిట్ల విక్రయాలు జరిగాయి. జాగ్వార్ ఎఫ్-పేస్, ఎక్స్‌ఇ, లాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్, రేంజ్ రోవర్, ఎవోక్ మోడల్ అమ్మకాలు అధికంగా జరిగినట్లు మంగళవారం ఓ ప్రకటనలో టాటా మోటార్స్ తెలిపింది. కాగా, ఫిబ్రవరి అమ్మకాల్లో జాగ్వార్ బ్రాండ్ కార్ల వాటా 12,203 యూనిట్లుగా ఉంటే, లాండ్ రోవర్ బ్రాండ్ కార్ల వాటా 28,775 యూనిట్లుగా ఉంది. నిరుడుతో పోల్చితే జాగ్వార్ అమ్మకాలు 81.1 శాతం పెరిగితే, లాండ్ రోవర్ విక్రయాలు 6.4 శాతం పడిపోయాయి.