బిజినెస్

టాటా మోటార్స్ స్పోర్ట్స్ కారు వచ్చేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెనీవా, మార్చి 7: స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరుగుతున్న 87వ అంతర్జా తీయ మోటార్ షోలో భారతీయ ఆటోరంగ దిగ్గజం టాటా మోటార్స్ తమ తొలి స్పోర్ట్స్ కారును ప్రదర్శిం చింది. టాటా మోటార్స్ లగ్జరీ బ్రాండైన జాగ్వార్ లాండ్ రోవర్ తమ నూతన సబ్-బ్రాండ్ టమో రెసమో ద్వారా ఈ స్పోర్ట్స్ కారును పరిచయం చేసింది. ప్రపంచ స్పోర్ట్స్ కార్ మార్కెట్‌ను శాసిస్తున్న జర్మనీకి చెందిన లగ్జరీ ఆటోరంగ సంస్థలైన పోర్షే, మెర్సిడెస్, బిఎమ్‌డబ్ల్యులకు పోటీగా టాటా మోటార్స్ ఈ టమో మోడల్‌ను తీసుకొచ్చింది. సరికొత్త రూపంలో ముం దుకొచ్చిన టమో.. అందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది. కాగా, ఈ షోలో ప్రముఖ అంతర్జాతీయ ఆటోరంగ సంస్థలెన్నో తమ కొత్త కార్లను ప్రదర్శించగా, టాటా మోటార్స్ టమో రెసమోతోపాటు నెక్సాన్ అనే మోడల్‌నూ ప్రదర్శించింది. టాటా సన్స్ చైర్మన్ ఎమిరేట్స్ రతన్ టాటాతోపాటు టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, టాటా మోటార్స్ సిఇఒ, ఎండీలు కూడా షోలో పాల్గొన్నారు

చిత్రాలు.. టాటా మోటార్స్ ప్యాసింజర్ కారు టమో నెక్సాన్
*టాటా మోటార్స్ స్పోర్ట్స్ కారు టమో రెసమో