బిజినెస్

జియో, పేటిఎమ్ క్షమాపణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 10: అనుమతి లేకుండా తమ ప్రకటనల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రాన్ని వాడుకున్నందుకుగాను రిలయన్స్ జియో, పేటిఎమ్ సంస్థలు క్షమాపణలు చెప్పాయి. ఈ మేరకు శుక్రవారం పార్లమెంట్‌లో ప్రభుత్వం తెలియజేసింది. 1950 చిహ్నాలు, పేర్ల చట్టం ప్రకారం ఈ రెండు సంస్థలకు వినియోగదారుల సంబంధాల మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో సదరు సంస్థలు క్షమాపణలు చెప్పినట్లు రాజ్యసభకు వినియోగదారుల సంబంధాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సిఆర్ చౌధరి ఓ లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. పత్రికల్లో వచ్చిన ఫుల్ పేజి ప్రకటనల్లో ప్రధాని మోదీ చిత్రాన్ని వేశాయన్నారు. తమ 4జి సేవల ప్రమోషన్ ప్రకటనలో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్.. మోదీ ఫొటోను ముద్రించగా, డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహక ప్రకటనలో చైనాకు చెందిన అలీబాబా సంస్థ సారథ్యంలోని పేటిఎమ్.. మోదీ ఫొటోను ప్రచురించింది.

వ్యాపార ప్రకటనల్లో మోదీ చిత్రం