బిజినెస్

భారీ లాభాలకు అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 12: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి సాధించిన ఘన విజయం ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను భారీ లాభాల్లో పరుగులు పెట్టించగలదన్న అంచనా నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో సూచీలు సరికొత్త స్థాయలను అందుకున్నా ఆశ్చర్యపోన క్కర్లేదని వారు అభిప్రాయపడుతున్నారు. దేశంలోనే అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని బిజెపి సొంతం చేసుకున్న నేపథ్యంలో కేంద్రంలోనూ బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వమే అయన నరేంద్ర మోదీ సర్కారు సంస్కరణల బాట పడుతుందని మదుపరులు గట్టిగా విశ్వసిస్తున్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు శనివారం విడులైనది తెలిసిందే. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బిజెపి స్పష్టమైన మెజారిటీని సాధించగా, మణిపూర్, గోవా రాష్ట్రాల్లోనూ అధికారం చేపట్టడానికి అవకాశాలను కలిగి ఉంది. పంజాబ్‌లో మాత్రం కాంగ్రెస్ గెలిచింది. అయతే కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని చేజిక్కించుకోవడంతో లోక్‌సభలో ఇప్పటికే బలం కలిగిన బిజెపికి రాజ్యసభలోనూ బలం పెరగనుంది. దీంతో ఆర్థిక సంస్కరణల విషయంలో ఇప్పుడే దూకుడు ప్రదర్శిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. మరింతగా సంస్కరణలను ప్రవేశపెడతారన్న నమ్మకం మదుపరులలో కనిపిస్తోందని, దీంతో పెట్టుబడులు పోటెత్తడం ఖాయమన్న అభిప్రా యాలు మార్కెట్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయ. ‘ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బిజెపి సాధించిన విజయం మార్కెట్లకు కొత్త జోష్‌ను తెప్పించడం ఖాయం. ముఖ్యంగా ఈ విజయం రాజ్యసభలో బిజెపి బలాన్ని పెంచుతుంది. దీంతో మరిన్ని ఆర్థిక సంస్కరణలకు ఆస్కారముంటుంది. ప్రస్తుతం లోక్‌సభలో మాత్రమే బిజెపికి ఆధిక్యం ఉండటంతో కీలకమైన బిల్లులు, నిర్ణయాలకు రాజ్యసభ నుంచి ఆమోదం లభించడం కష్టతరమవుతోంది. కానీ ఉత్తరప్రదేశ్ గెలుపుతో రాజ్యసభలోనూ బిజెపి బలపడనుంది. ఇది మోదీ అధికార పరిధిని మరింత పెంచుతుంది.’ అని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అన్నారు. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం 2019 సార్వత్రిక ఎన్నికలపైనా ఉంటుందని, వచ్చే ఏడాది జరిగే రాష్టప్రతి ఎన్నికలోనూ బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ కూటమిది పైచేయగా నిలుస్తుందని సింఘానియా చెప్పారు. కాగా, సోమవారం హోళి సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు కావడంతో మంగళవారం ప్రారంభమయ్యే ట్రేడింగ్‌లో రికార్డు స్థాయ లాభాలు నమోదు కావచ్చన్న అంచనాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయ. అదేరోజు ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యసమీక్ష కూడా ఉండనుండగా, మంగళవారమే ఫిబ్రవరి నెలకుగాను ద్రవ్యోల్బణం గణాంకాలూ విడుదలవుతున్నాయ. దీంతో ఈ వారం మార్కెట్ సరళి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై, ఇటు ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యసమీక్షపై, అటు ద్రవ్యోల్బణం గణాంకాలపైనే ప్రధానంగా ఆధారపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విజయంతో దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే సంస్కరణలకు మోదీ శ్రీకారం చుడతారు.’ అన్న విశ్వాసాన్ని ప్రభుదాస్ లిల్లదర్ చీఫ్ పోర్ట్ఫోలియో మేనేజర్-పిఎమ్‌ఎస్, సిఇఒ అజయ్ బొడ్కే వ్యక్తం చేశారు. ‘తాజా ఎన్నికల ఫలితాలతో కీలక ఆర్థిక సంస్కరణలను నిర్భయంగా తీసుకునే స్వేచ్ఛ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి లభించింది.’ అని సెంట్రమ్ బ్రోకింగ్‌లో ఇడి, సిఇఒ అయన కె సందీప్ నాయ క్ అన్నారు. ‘బిజెపి సాధించిన ఈ గెలుపుతో అన్ని రంగాల్లో సంస్కరణలు రావడం ఖాయం.’ అని శామ్‌కో సెక్యూరిటీస్ సిఇఒ జిమ్మెట్ మోదీ అభిప్రాయపడ్డారు. ‘మోదీ ఛరిష్మాతో సిద్ధించిన ఈ ఘన విజయం స్టాక్ మార్కెట్ల సూచీలను నూతన శిఖరాలకు చేర్చుతుంది.’ అని అమ్రపాలి ఆద్య ట్రేడింగ్ అండ్ ఇనె్వస్ట్‌మెంట్స్ రిసెర్చ్ అధిపతి-డైరెక్టర్ అబ్నిశ్ కుమార్ సుధాంశు అంచనా వేశారు. మరోవైపు బుధవారం అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడరల్ రిజర్వ్.. వడ్డీరేట్లపై తమ నిర్ణయాన్ని ప్రకటించ నుండటంతో మదుపరులు దీని ఆధారంగా కూడా తమ పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకోవచ్చని, ముఖ్యంగా విదేశీ మదుపరుల నిర్ణయాలు మారవచ్చని రిలయన్స్ సెక్యూరిటీస్ రిసెర్చ్ అధిపతి రాకేశ్ టర్వే అన్నారు. కాగా, అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలూ మదుపరుల పెట్టుబడులపై ప్రభావం చూపుతాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయ. ప్రధానంగా విదేశీ వ్యాపారంపైనే ఆధారపడ్డ భారతీయ ఐటి సంస్థలను అమెరికా హెచ్-1బి వీసాల వ్యవహారం ఆందోళనకు గురిచేస్తోంది. వీసాల జారీ అంశానికి సంబంధించి అమెరికా సర్కారు కొత్త మార్పులకు ప్రతిపాదిస్తుండటమే కారణం. ఇక ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయ మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల కదలికలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 113.78 పాయింట్ల్లు పెరగగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 37 పాయింట్లు లాభపడింది.