బిజినెస్

ఎస్‌ఎంఇలకు రాయితీలేవి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2017-18)గాను తెలంగాణ ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి, పట్టణాభివృద్ధి, సాగునీటి రంగానికి అధిక కేటాయింపులు చేసిందని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య ఎఫ్‌ట్యాప్సీ అధ్యక్షుడు రవీంద్ర మోది అన్నారు. అయితే చిన్న, మధ్యతరహా పారిశ్రామిక వర్గాలకు కేటాయించాల్సిన రాయితీలకు, వ్యాట్ రియంబర్స్‌మెంట్‌కు నిధులు కేటాయించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనివల్ల కొత్తగా ఏర్పాటు చేయాలనుకునే చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై తీవ్ర వ్యతిరేక ప్రభావం పడుతుందని తెలిపారు. వివిధ పద్దతుల్లో ఎస్‌ఎంఇలకు చెల్లించాల్సిన రూ. 1,615 కోట్ల రాయితీల బ్యాక్‌లాగ్ ఉందని ఆయన గుర్తు చేశారు.
ఇది సంక్షేమ బడ్జెట్: సిఐఐ
బడ్జెట్‌లో సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) తెలంగాణ యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. సాగునీటి పారుదల, గ్రామీణాభివృద్ధి, సామాజికాభివృద్ధి రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని కొత్త అధ్యక్షుడు వి రాజన్న తెలిపారు. పాత పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్థిక వ్యవస్థ కొంత చిన్నాభిన్నమైనప్పటికీ తెలంగాణ ప్రభు త్వం తీసుకున్న పారిశ్రామిక రంగ అనుకూల నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆర్ధిక వృద్ధి రేటు 19.61 శాతం నమోదైందని పేర్కొన్నారు. తెలంగాణ ఐ-పాస్ విధానం వల్ల 58,341 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, 2.20 లక్షల ఉపాధి అవకాశాలు లభించేందుకు దోహదపడ్డాయని తెలిపారు. కాగా, ఇది ప్రజానుకూలమైన బడ్జెట్‌గా సిఐఐ వైస్ చైర్మన్ సంజయ్ సింగ్ అభివర్ణించారు.