బిజినెస్

అంతా ఆన్‌లైన్‌లోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 13: పాత పెద్ద నోట్ల రద్దుతో ఆన్‌లైన్ మార్కెట్‌పై అంచనాలు ఆకాశం వైపు వెళ్తున్నాయ. నగదు కొరత కారణంగా కొనుగో లుదారులు డిజిటల్ పేమెంట్లకు మొగ్గు చూపు తున్నారు మరి. క్షణం తీరికలేని ఈ యాంత్రిక జీవనంలో షాపింగ్ మాల్స్‌కు వెళ్లి అక్కడ గంటల తరబడి ఏరికోరి నచ్చిన వాటిని కొనుక్కునే ఓపికలేని వారంతా కూడా ఇప్పుడు ఆన్‌లైన్ షాపింగ్‌పైనే ఆధారపడుతున్నారు. వ్యయప్రయాసలకోర్చి ట్రాఫిక్ జంజాటమ్, కాలుష్య కోరల్లో చిక్కుకుని షాపింగ్ చేయడం దేనికనుకుంటున్న వినియోగదారులు ఇంట్లోనే ఎంచక్కా ఈ-కామర్స్ సంస్థల ద్వారా కావలసినవి కొనేస్తున్నారు. ఈ క్రమంలో 2019-20 నాటికి భారతీయ ఆన్‌లైన్ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లను దాటుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయ. బహిరంగ మార్కెట్‌లో షాపింగ్ ద్వారా బోలెడంతా సమయం, డబ్బులు వృథా అవుతున్నాయని భావిస్తున్న కొనుగోలుదారులు.. ఆన్‌లైన్ మార్కెట్‌లో తక్కువ సమయంలోనే ఎక్కువ ఉత్పత్తులు కొనుగోలు చేయవచ్చని అంటున్నారు. బయటకి వెళ్లాలంటే ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించాల్సి వస్తుందని, అలాకాకుండా ఇంట్లోనే ఎం చక్కా కంప్యూటర్, మొబైల్, టాబ్లెట్ ఇంటర్నెట్ ద్వారా షాపింగ్ చేస్తున్నామని చెబుతున్నారు. ఆన్‌లైన్ మార్కెటింగ్ సౌకర్యం 24 గంటలూ ఉండటం కూడా అధికులు ఈ వెబ్ కొనుగోళ్లకు అలవాటుపడటానికి ఓ ప్రధాన కారణంగా నిలుస్తోంది. పైగా ఆన్‌లైన్‌లో కొన్న వస్తువులను ఆయా ఈ-కామర్స్ సంస్థల ప్రతినిధులే ఇంటికి తీసుకొచ్చి ఇస్తుండటం కూడా ఆన్‌లైన్ షాపింగ్‌కు నానాటికి ఆదరణను తెచ్చిపెడుతోంది. పాత పెద్ద నోట్ల రద్దుతో ఈ-షాపింగ్ మరింత పెరిగింది. నచ్చకపోతే వస్తువులను వెనక్కి పంపించేయడం, మరొకదాన్ని మార్చుకునే సౌలభ్యం కూడా ఆన్‌లైన్ మార్కెట్‌లో ఉండటం కలిసొస్తోంది. అంతేగాక బ్యాంకులు, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా జరిపే షాపింగ్‌కు ప్రోత్సాహకాలు ప్రకటిస్తుండటం కూడా ఆన్‌లైన్ వ్యాపారం దూకుడును పెంచుతోంది. ఇకపోతే మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, డిజైనర్ ఫర్నీచర్, గృహలంకరణ వస్తువులు, దుస్తులు, ఆభరణాలు, యాక్ససెరీస్, పాదరక్షల అమ్మకాలు ఆన్‌లైన్ మార్కెట్‌లోనే అధికంగా జరుగుతున్నాయి. నిజానికి ఆర్థిక మందగమనంలోనూ ఆన్‌లైన్ షాపింగ్ వృద్ధిపథంలో నడుస్తుండగా, దీనికి కారణం ఆయా ఈ-కామర్స్ సంస్థలు ప్రకటిస్తున్న డిస్కౌంట్లు, ఆఫర్లే. బహిరంగ మార్కెట్‌లోకి ఇంకా రాని వస్తువులు కూడా ముందే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండటం, ప్రత్యేక సేల్స్ పేరిట రోజులు, వారాలదాకా అన్నిరకాల వస్తువులపై భారీ డిస్కౌంట్లను ప్రకటించడం చేస్తున్నాయి ఈ-కామర్స్ సంస్థలు. ముఖ్యంగా పండగ సీజన్లలో ఈ డిస్కౌంట్లు, ఆఫర్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఈ ఏడాది 80,000 కోట్ల రూపాయల నుంచి లక్ష కోట్ల రూపాయల వరకు పండగ సీజన్ అమ్మకా లుండొచ్చని పారిశ్రామిక సంఘం అసోచామ్ అంటోంది. ప్రస్తుతం అందరికి ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న మొబైల్స్ ఉండటం, రిలయన్స్ జియో రాకతో పెరిగిన మొబైల్ ఇంటర్నెట్ వినియోగం.. ఆన్‌లైన్ మార్కెటింగ్‌కు దన్నుగా నిలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4జి మొబై ల్ నెట్‌వర్క్ ఉంది. అన్ని టెలికామ్ సంస్థలు అన్ని సర్కిళ్లలో ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తెస్తు న్నాయ. దీనికి అనుగుణంగానే నగరాల నుంచి పట్టణాల నుంచి పల్లెలకు ఈ-కామర్స్ వ్యాపారం విస్తరిస్తోంది. అయితే ఆన్‌లైన్ మార్కెట్ విస్తృతితో సంప్రదాయ మార్కెట్ దెబ్బతింటోందని, బహిరంగ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ తమ సౌకర్యార్థం వినియోగదారులు ఆన్‌లైన్ మార్కెట్‌కే మొగ్గుచూపుతుండటంతో వారు ఏమీ చేయలేకపోతున్నారు. ఈ ఒక్క కారణంతోనే కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వద్దకు వ్యాపారుల ఆందోళన చేరినా ఫలితం లేకపోతోంది. తద్వారా స్నాప్‌డీల్, మింత్రా, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, జబాంగ్ తదితర ఈ-కామర్స్ సంస్థలు ఆన్‌లైన్ మార్కెట్‌లో దూసుకెళ్తున్నాయి.
పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులను మోదీ సర్కారు కూడా ప్రోత్సహిస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలోనే డిజిటల్ పేమెంట్లకు ఊతమిస్తూ వినియోగదారులు, వ్యాపారుల కోసం రెండు సరికొత్త పథకాలను నిరుడు క్రిస్మస్ రోజునే ప్రారంభించింది కేంద్రం. లక్కీ గ్రాహక్ యోజన, డిజి-్ధన్ వ్యాపారి యోజన పేరిట వీటిని పరిచయం చేసింది. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్‌ల చేతులమీదుగా మొదలైన ఈ పథకాలు 100 రోజులు అమల్లో ఉంటాయి. ఈ వ్యవధిలో డిజిటల్ పేమెంట్స్ చేసే వినియోగదారులకు, వాటిని అనుమతించే వ్యాపారులకు నగదు బహుమతులు అదిస్తోంది కేంద్రం. లక్కీ గ్రాహక్ యోజన కింద ఈ 100 రోజుల్లో రోజుకు 15 వేల మంది వినియోగదారులను లక్కీ డ్రాల ద్వారా ఎంపికచేసి ఒక్కొక్కరికి 1,000 రూపాయలను ఇస్తున్నారు. అలాగే వారానికోసారి జరిగే డ్రాలో ఏడుగురు విజేతలకు గరిష్ఠంగా లక్ష రూపాయలను అందిస్తుండగా, ఇక డిజి-్ధన్ వ్యాపారి యోజన పథకం కింద వారానికి 7 వేల మంది వ్యాపారులకు బహుమతులు అందుతున్నాయ. గరిష్ఠంగా ఒక్కొక్కరు 50,000 రూపాయల వరకు పొందుతుండగా, ఇవేగాక మెగా బహుమతుల కింద కోటి రూపాయలు, 50 లక్షల రూపాయలు, 25 లక్షల రూపాయల బహుమతులూ ఉన్నాయి. పాత పెద్ద నోట్ల రద్దు అయిన నిరుడు నవంబర్ 8 నుంచి వచ్చే నెల ఏప్రిల్ 13 మధ్య డిజిటల్ లావాదేవీలు జరిపిన వినియోగదారుల నుంచి విజేతలను ఎంపిక చేస్తారు. వారికే ఏప్రిల్ 14న ఈ మెగా బహుమతులు అందుతాయి. వ్యాపారులకూ 50 లక్షల రూపాయలు, 25 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయల మెగా బహుమతులను ఇవ్వనున్నారు. కాగా, 50 రూపాయల నుంచి 3,000 రూపాయల మధ్య జరిగిన డిజిటల్ పేమెంట్లకే ఈ పథకాలు వర్తిస్తున్నాయ. ఈ రెండు పథకాల కోసం 340 కోట్ల రూపాయలను కేంద్రం వెచ్చిస్తోంది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం పాత పెద్ద నోట్లను రద్దు చేసినది తెలిసిందే. నిరుడు నవంబర్ 8వ తేదీ రాత్రి 500, 1,000 రూపాయల నోట్ల చలామణిని నిలిపివేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. వీటి స్థానంలో కొత్త 500, 2,000 రూపాయల నోట్లను పరిచయం చేస్తున్నట్లు తెలపగా, రద్దయిన నోట్లను డిసెంబర్ 30 వరకు బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో డిపాజిట్ చేసుకుని, వాటికి సమాన విలువైన కొత్త నోట్లను పొందవచ్చనీ చెప్పారు. అయితే డిమాండ్‌కు తగ్గ కొత్త నోట్లు చలామణిలోకి రాకపోవడం, 2 వేల రూపాయల నోట్లు మాత్రమే లభించడంతో చిల్లర సమస్యలు తలెత్తాయి. 500 రూపాయల నోట్ల సరఫరా లేకపోవడం, 100, 50, ఇతరత్రా చిల్లర నోట్లు అతి తక్కువగా ఉండ టంతో నగదు లావాదేవీలు నిలిచి వ్యాపా రం స్తంభించిపోయింది. దీంతో డిజిటల్ పేమెంట్ల వైపు నడవాలంటూ కేంద్ర ప్రభుత్వం ప్రచారం మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే లక్కీ గ్రాహక్ యోజన, డిజి-్ధన్ వ్యాపారి యోజన పథకాలను ప్రారంభించింది. కేంద్రం తీసుకుంటున్న చర్యలతో ఆన్‌లైన్ మార్కెటింగ్, షాపింగ్ పెరుగుతున్నాయ. పిఒఎస్ (పాయంట్ ఆఫ్ సేల్) మెషీన్లను మరింతగా అందుబాటులోకి తెస్తుండ టంతో పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లతోపాటు కిరణా షాపుల్లోనూ కార్డు స్వైపింగ్ ద్వారా అమ్మకాలు పుంజుకుంటున్నాయ.
మరోవైపు నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలనే లక్ష్యంతో ఖాతాదారుల నగదు లావాదేవీలపై ప్రైవేట్‌రంగ బ్యాంకులు పెను భారం మోపినదీ తెలిసిందే. నగదు డిపాజిట్లు, ఉపసంహరణలు నెలలో నాలుగుసార్లు మించితే ఒక్కో లావాదేవికి ఏకంగా 150 రూపాయలను వ సూలు చేస్తామని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకర్లు ప్రకటించారు. ప్రైవేట్‌రంగ బ్యాంకిం గ్ దిగ్గజాలైన హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, యాక్సిస్‌లు కనీసం 150 రూపాయల చార్జీని వసూ లు చేస్తామని స్పష్టం చేశాయి. సేవింగ్స్ ఖాతాలతోపాటు వేత న ఖాతాదారులకు (సాలరీ అకౌం ట్స్) ఈ చార్జీలు వర్తిస్తాయని, ఈ నెల 1 నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నాయ. అలాగే రోజుకు థర్డ్ పార్టీ నగదు లావాదేవీలు 25,000 రూపాయలు మించరాదని కూడా షరతు విధించింది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగదు కొరత, డిజిటల్ లావాదేవీలకు ఊతమివ్వాలన్న కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ప్రకటనలతోనే బ్యాంకులు ఈ స్థాయిలో చార్జీలను వసూలు చేసేందుకు సిద్ధమయ్యాయి. నిజానికి పాత పెద్ద నోట్ల రద్దుకు ముందు కేవలం ఎటిఎమ్ లావాదేవీలపైనే పరిమితులు, చార్జీలుండేవి. అప్పుడు అదనంగా జరిగిన ఒక్కో లావాదేవీకి 20 రూపాయల వరకు చార్జ్ చేసేవి బ్యాంకులు. కానీ ఇప్పుడు ఆ చార్జీని దాదాపు ఎనిమిది రెట్లు పెంచిన బ్యాంకులు.. నగదు డిపాజిట్లపైనా కొరడా ఝుళిపించాయి. కాగా, సొంత బ్యాంక్ శాఖల్లో నెలకు నాలుగుసార్లు ఉచితంగానే నగదు లావాదేవీలు జరుపుకోవచ్చని, అవి దాటితే ప్రతి వెయ్యి రూపాయలకు 5 రూపాయల చొప్పున కనీసం 150 రూపాయల వరకు చార్జ్ తీసుకుంటామని ఐసిఐసిఐ బ్యాంక్ తెలిపింది. ఇతర బ్యాంకుల వారికి తొలి నగదు ఉపసంహరణ ఉచితమని చెప్పిన ఐసిఐసిఐ.. ఆ తర్వాత చార్జీలు వర్తిస్తాయంది. నగదు డిపాజిట్లకు మాత్రం చార్జీలు తప్పవంది. అయితే క్యాష్ డిపాజిట్ మెషీన్ ద్వారానైతే తొలిసారి ఉచితమని, ఆ తర్వాత చార్జీలు యథాతథమంది. కాగా, థర్డ్ పార్టీ నగదు లావాదేవీ పరిమితిని 50,000 రూపాయలుగా నిర్ణయించింది. మరోవైపు సొంత బ్యాంక్ ఎటిఎమ్‌లు కాకుండా కనిపించిన ఇతర బ్యాంక్ ఎటిఎమ్‌లలో లావాదేవీలు చేస్తే కూడా గతంలో మాదిరిగా ఇకపై చార్జీలు వర్తిస్తాయి. ఇదిలావుంటే యాక్సిస్ బ్యాంక్ నెలకు తొలి ఐదు లావాదేవీలు లేదా 10 లక్షల రూపాయల వరకు నగదు డిపాజిట్లు, ఉపసంహరణలు ఉచితమని ప్రకటించింది. ఆ తర్వాత వెయ్యికి 5 రూపాయల చొప్పున కనీసం 150 రూపాయల వరకు చార్జ్ చేస్తామని ప్రకటించింది. వీటిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతుండగా, ప్రభుత్వరంగ బ్యాం కులు మాత్రం తమకు ఈ తరహా చార్జీలకు సంబంధించి ప్రభుత్వ వర్గాల నుంచి ఎలాంటి సమాచారం లేదంటున్నాయి. అయతే ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ.. ఏప్రిల్ 1 నుంచి ఎటిఎం సేవలపై మళ్లీ చార్జీలను తీసుకొస్తున్నట్లు ప్రకటించినది తెలిసిందే. కానీ ప్రభుత్వం పైకి వీటిని వద్దంటూనే డిజిటల్ లావాదేవీలకు బ్యాంకర్ల నిర్ణయాలు పనికి వస్తాయన్న అభిప్రాయంతో ఉంది. మరోవైపు ప్రస్తుతం కూడా ఎటిఎంలన్నీ నగదు లేకుండా కనిపిస్తుండటంతో డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగింది. మొత్తానికి పాత పెద్ద నోట్ల రద్దుతో డిజిటల్ లావాదేవీలు, ఆన్‌లైన్ షాపింగ్ ఊపందుకున్నది మాత్రం అంగీకరించాల్సిందే.

‘్భరతీయ ఈ-కామర్స్ మార్కెట్ ప్రపంచంలోనే అత్యంత వృద్ధిరేటు కలిగినదిగా అవతరిస్తోంది. యేటేటా పెట్టుబడులు 50 శాతం పెరుగుతున్నాయ. 2020 నాటికి భారత ఆన్‌లైన్ మార్కెటింగ్ విలువ 102 బిలియన్ డాలర్ల నుంచి 119 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఆన్‌లైన్ షాపర్ల సంఖ్య కూడా దాదాపు 320 మిలియన్లకు చేరవచ్చు. ప్రతీ సెకను ముగ్గురు ఇంటర్నెట్ యూజర్లు పెరుగుతున్నారు. ఇప్పటికే ప్రపంచంలో ఇంటర్నెట్ వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఇంటర్నెట్ వాడకం పెరిగినకొద్దీ ఆన్‌లైన్ మార్కెటింగ్ పెరగడం సర్వసాధారణం.’ - మోర్గాన్ స్టాన్లీ