బిజినెస్

ఉద్యోగుల కోత దిశగా ఎస్‌బిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 26: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ).. ఉద్యోగులను తగ్గించుకోనుంది. ప్రస్తుతం ఎస్‌బిఐ ఉద్యోగులు 2 లక్షల వరకు ఉన్నారు. భారతీయ మహిళా బ్యాంక్ (బిఎమ్‌బి)తోపాటు మరో ఐదు అనుబంధ బ్యాంకులు విలీనం అవుతున్న నేపథ్యంలో ఈ సంఖ్య మొత్తం 2,77,000లకు పెరగనుంది.
దీంతో 2019 మార్చికల్లా 10 శాతం లేదా దాదాపు 30,000 ఉద్యోగులను తగ్గించుకోవాలని ఎస్‌బిఐ భావిస్తోంది. ఈ మేరకు ఎస్‌బిఐ మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరైన రజ్‌నీశ్ కుమార్ తెలిపారు. కొత్త నియామకాలు సగానికి తగ్గవచ్చన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌తోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాల శాఖలు వచ్చే నెల 1 నుంచి ఎస్‌బిఐలో విలీనం అవుతున్నది తెలిసిందే. దీంతో ఎస్‌బిఐ అసెట్ బేస్ 37 లక్షల కోట్ల రూపాయలకు, శాఖలు 22,500లకు, ఎటిఎంలు 58,000లకు, కస్టమర్ల సంఖ్య 50 కోట్లకుపైగా చేరనుంది.