బిజినెస్

ఐఐటి హైదరాబాద్‌తో ఫ్లైదుబాయ్ ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (ఐఐఐటి) హైదరాబాద్‌తో దుబాయ్‌కి చెందిన ఫ్లైదుబాయ్ సంస్థ సోమవారం ఓ ఒప్పందాన్ని చేసుకుంది. ఇక్కడి ఇనిస్టిట్యూట్ వద్ద ఏవియేషన్ కో-ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటు కోసం ఈ ఒప్పందం జరిగింది. దీనిపై ఫ్లైదుబాయ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రమేశ్ వెంకట్, ఐఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ పిజె నారాయణన్ సంతకాలు చేశారు. కాగా, ఈ ఒప్పందంలో భాగంగా ఐఐఐటి హైదరాబాద్ రిసెర్చర్లు, సిబ్బందితో ఫ్లైదుబాయ్ డొమైన్ నిపుణులు, ఇంజినీర్లు కలిసి పనిచేయనున్నారు. ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటన స్పష్టం చేసింది.