బిజినెస్

జిఎస్‌టి పరిధిలోకి భూముల లీజు, భవనాల అద్దెలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: వచ్చే జూలై 1 నుంచి భూముల లీజు, భవనాల అద్దె, నిర్మాణంలో ఉన్న గృహాల కొనుగోళ్లకు చెల్లించే నెలసరి వాయిదా (ఇఎమ్‌ఐ)లు వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) పరిధిలోకి రానున్నాయి. అయినప్పటికీ భూములు, భవనాల అమ్మకాలు మాత్రం జిఎస్‌టి పరిధిలోకి రావు. వీటికి స్టాంప్ డ్యూటీనే వర్తించనుంది. ఈ మేరకు సోమవారం లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన ఈ కొత్త పరోక్ష పన్ను విధానం (జిఎస్‌టి) చెబుతోంది. ఎలక్ట్రిసిటీని కూడా జిఎస్‌టికి దూరంగానే ఉంచారు. మోదీ సర్కారు జిఎస్‌టి బిల్లును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోగా, దీన్ని జూలై 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని చూస్తున్నారు.