బిజినెస్

కార్గో హ్యాండ్లింగ్‌లో విశాఖ పోర్టు రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 1: సరకు రవాణాలో విశాఖపట్నం పోర్టు ట్రస్టు రికార్డు సృష్టించింది. పాత పెద్ద నోట్ల రద్దు వంటి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో కూడా గత ఆర్థిక సంవత్సరం 2016-17లో 61.02 మిలియన్ టన్నుల సరకు రవాణా చేయగలిగింది. అంతకుముందు 2015-16 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే సరకు రవాణాలో 7 శాతం వృద్ధి సాధించిందని పోర్టు చైర్మన్ ఎంటి కృష్ణబాబు శనివారం విలేఖరుల సమావేశంలో వెల్లడించారు.
ఇతర పోర్టుల నుంచి తీవ్ర పోటీ ఉన్నప్పటికీ నిరుడుతో పోల్చితే 4 మిలియన్ టన్నుల సరకు రవాణా పెరగడం విశాఖ పోర్టు పనితీరుకు నిదర్శనమన్నారు. 2016-17 సంవత్సరానికిగాను 11.42 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం రవాణా చేయగా, నిరుడుతో చూస్తే 91 శాతం అధికమని తెలిపారు. 2015-16లో ఇనుప ఖనిజం రవాణా కేవలం 5.98 శాతం మాత్రమేనన్నారు. కంటైనర్ కార్గోలోనూ విశాఖ పోర్టు రికార్డులు తిరగరాసిందని చెప్పారు. 2016-17లో 6.43 మిలియన్ టన్నుల కంటైనర్ కార్గో సాధించగా, నిరుడు 5.15 మిలియన్ టన్నులు మాత్రమేనని, ఈ రంగంలో 25 శాతం వృద్ధి సాధ్యమైందన్నారు. బాక్సైట్ ఖనిజ రవాణా 1.01 మిలియన్ టన్నులవగా, అంతకుముందు సంవత్సరం కేవలం 0.48 మిలియన్ టన్నులు మాత్రమే. పెట్రోలియం కోక్ రవాణా 2.10 మిలియన్ టన్నులు కాగా, నిరుడు 1.67 టన్నులు మాత్రమేనని తెలిపారు. జిప్సమ్ ఖనిజ రవాణాలో కూడా పోర్టు మంచి ఫలితాలు సాధించిందన్నారు. 10.17 లక్షల టన్నుల జిప్సమ్ రవాణా చేయగా, అంతకుముందు సంవత్సరంతో పోల్చితే 34 శాతం అధికమని తెలిపారు. కాగా, సుమారు దశాబ్దకాలం అనంతరం విశాఖ పోర్టు రష్యా, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా దేశాల నుంచి 4.17 లక్షల టన్నుల గోధుమలను దిగుమతి చేసుకుందని వెల్లడించారు. పాలన, నిర్వహణపరంగా తీసుకున్న పలు సంస్కరణలు పోర్టును అగ్రగామిగా నిలుపుతున్నాయని చైర్మన్ కృష్ణబాబు అన్నారు. పోర్టు సాధించిన ఈ ప్రగతికి పలు అంశాలు దోహదం చేశాయని, పోర్టులో ప్రతి బెర్త్ నుంచి రోజుకు 13.061 టన్నుల సరకు రవాణా జరిగిందని, నిరుడు 12,802 టన్నులు మాత్రమేనని వివరించారు. పోర్టులో అమలు చేస్తున్న యాంత్రీకరణ, బిజిసి సిఫార్సుల అమలు, లోతైన పర్యవేక్షణ, కార్గో హ్యాండ్లింగ్‌లో లెవీ కుదింపు వంటి అంశాలు ఘనత సాధించేందుకు దోహదం చేశాయన్నారు. గతంతో పోల్చితే విశాఖ పోర్టుకు వచ్చే నౌకలు ఎక్కువకాలం వేచి ఉండే పరిస్థితులు లేవన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో విశాఖ పోర్టుకు సరకు రవాణా నిమిత్తం 1,944 నౌకలు రాకపోకలు సాగించాయని స్పష్టం చేశారు. ఇతర పోర్టుల నుంచి ఎదురవుతున్న పోటీని ఎదుర్కొనేందుకు విశాఖ పోర్టులో తీసుకుంటున్న పలు సంస్కరణలను ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. కొత్త ఖాతాదారులను ఆకర్షించేందుకు వాణిజ్యాభివృద్ధి బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఉక్కు, గ్రానైట్, ఆహార పదార్థాలు, అల్యూమినియం, ప్రాజెక్ట్సు అండ్ జనరల్ కార్గోలో వెవీని పూర్తి స్థాయిలో తగ్గించగలిగామన్నారు. సరకు రవాణాలో మానవ సామర్థ్యాన్ని 265 శాతం నుంచి 165 శాతానికి తగ్గించగలిగామన్నారు. అలాగే పోర్టులో సరకు నిల్వకు సంబంధించి లైసెన్స్ ఫీజులను చదరపు మీటరుకు 6.12 రూపాయల నుంచి 3.11 రూపాయలకు తగ్గించామన్నారు. ఈ అంశాలు పోర్టు సాధించిన ప్రగతికి సానుకూలంగా నిలిచాయని పేర్కొన్నారు.