బిజినెస్

నల్లధనం వెలికితీతపై గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: అప్రకటిత ఆదాయాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు దేశంలో పెద్ద నోట్లను రద్దు చేయడంతో పాటు బ్యాంకులు, ఎటిఎంల నుంచి నగదు ఉపసంహరణలు, నగదు లావాదేవీలపై పరిమితులు విధించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పుడు విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనాన్ని వెలికితీయడంపై దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా స్విస్ బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచినట్లుగా అనుమానిస్తున్న దాదాపు పది మంది భారతీయులు, భారత సంస్థల బ్యాంకింగ్ వివరాలను అందజేయాలని కేంద్ర ప్రభుత్వం స్విట్జర్లాండ్‌ను కోరింది. స్టాక్ మార్కెట్లలో లిస్టయిన రెండు జౌళి సంస్థలతో పాటు తివాచీల ఎగుమతి వ్యాపారం చేస్తున్న ఒక ఆర్ట్ క్యూరేటర్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. దీంతో భారత్ కోరిన సమాచారాన్ని అందజేయాలని నిర్ణయించుకున్న స్విట్జర్లాండ్ పన్నుల విభాగం ఈ విషయమై సంబంధిత భారత సంస్థలు, వ్యక్తులకు గత వారం నోటీసులు జారీ చేసింది. తమ నిర్ణయంపై అప్పీలు చేసుకోదలచిన వారు 30 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. పన్నుల ఎగవేతకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్న విదేశీ సంస్థలు, వ్యక్తుల వివరాలను ఆయా దేశాలకు అందజేయడానికి ముందు దీనిపై వివరణ ఇచ్చేందుకు స్థానిక నిబంధనల ప్రకారం స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఆయా సంస్థలు, వ్యక్తులకు చివరి అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ వివరణలు ఇచ్చేందుకు నేరుగా సంబంధిత బ్యాంకులను లేదా పన్నుల విభాగాన్ని ఆశ్రయించలేకపోతున్న వారి నోటీసులను స్విట్జర్లాండ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా బహిర్గతం చేస్తోంది. భారత్‌కు సంబంధించిన దాదాపు పది మంది వ్యక్తులు, సంస్థలకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం గత వారం ఇటువంటి నోటీసులు జారీ చేసింది. స్టాక్ మార్కెట్లలో లిస్టయిన రెండు జౌళి సంస్థలు (నియో కార్పోరేషన్ ఇంటర్నేషనల్, ఎస్‌ఇఎల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్) సహా పనామా, వర్జిన్ ఐలాండ్స్ లాంటి ట్యాక్స్ హెవెన్ దేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న మరికొన్ని భారత సంస్థలు, వ్యక్తులకు ఈ నోటీసులు జారీ అయ్యాయి.