బిజినెస్

సబ్సిడీ వంట గ్యాస్ ప్రియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: దేశంలో సబ్సిడీపై లభించే వంట గ్యాస్ (ఎల్‌పిజి) ధర తాజాగా మరోసారి పెరిగింది. ఇటీవల ఐదు రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికలకు ముందు నామమాత్రంగా 2 రూపాయలు పెంచిన సబ్సిడీ ఎల్‌పిజి సిలిండర్ ధరను ఈసారి అంతర్జాతీయ మార్కెట్ల ధోరణులకు అనుగుణంగా 5 రూపాయల 57 పైసల చొప్పున పెంచారు. అయితే గత రెండు నెలల నుంచి పెరుగుతూ వచ్చిన నాన్-సబ్సిడీ (సబ్సిడీ యేతర) ఎల్‌పిజి సిలిండర్ ధరను ఈసారి 14 రూపాయల 50 పైసల మేరకు తగ్గించారు. దీంతో 14.2 కిలోల నాన్-సబ్సిడీ ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.737.50 నుంచి 723 రూపాయలకు తగ్గింది. అలాగే విమాన ఇంధనం (ఎటిఎఫ్) ధరను కూడా కిలో లీటర్‌కు రూ.2,811.38 చొప్పున (5.1 శాతం) తగ్గించారు. దీంతో కిలోలీటర్ ఎటిఎఫ్ ధర 51,428 రూపాయలకు తగ్గింది. తాజాగా సవరించిన రేట్లన్నీ ఈ నెల 1వ తేదీ నుంచే అమలులోకి వచ్చాయని చమురు సంస్థలు వెల్లడించాయి.